గత ఆర్థిక సంవత్సరంలో 2019-20లో ఒక్క 2వేల నోటును కూడా ముద్రించలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మంగళవారం తెలిపింది. చెలామణిలో ఉన్న  2వెల కరెన్సీ నోట్ల సంఖ్య 2018 మార్చి చివరి నాటికి 33,632 లక్షల నోట్ల నుండి 2019 మార్చి చివరి నాటికి 32,910 లక్షల నోట్లకు, 2020 మార్చి చివరి నాటికి 27,398 లక్షల నాట్లకు పడిపోయిందని నివేదిక తెలిపింది.

2020 మార్చి చివరి నాటికి మొత్తం నోట్లలో 2.4 శాతం రూ.2,000 డినామినేషన్ నోట్లు ఉన్నాయని, ఇది 2019 మార్చి చివరి నాటికి 3 శాతం, 2018 మార్చి చివరి నాటికి 3.3 శాతం తగ్గిందని నివేదిక పేర్కొంది. విలువ పరంగా, ఈ వాటా 2020 మార్చి చివరి నాటికి 22.6 శాతానికి పడిపోయింది, 2019 మార్చి చివరి నాటికి 31.2 నుండి మరియు 2018 మార్చి చివరినాటికి 37.3 శాతానికి పడిపోయింది.

also read మనీలాండరింగ్ కేసుల్లో నీరవ్ మోడీ భార్యపై ఇంటెర్నేషనల్ అరెస్ట్ వారెంట్.. ...

మరోవైపు రూ.500, రూ.200 కరెన్సీ నోట్ల ముద్రన, చలామణీ గణనీయంగా పెరిగింది. 2020 మార్చి చివరి నాటికి చెలామణిలో ఉన్న రూ.500, 2,000 నోట్ల వాటా మొత్తం 83.4 శాతం. 500 నోట్ల వాటా మాత్రం గణనీయంగా పెరిగింది అని అన్నారు. కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి నోట్ల సరఫరాను ప్రభావితం చేసిందని ఆర్‌బిఐ తెలిపింది.

"2019-20లో నోట్ల సరఫరా కూడా మునుపటి సంవత్సరంతో పోలిస్తే 23.3 శాతం తగ్గింది, ప్రధానంగా కోవిడ్-19 వ్యాప్తి చెందడం, లాక్ డౌన్ కారణంగా అంతరాయాలు ఏర్పడ్డాయి" అని ఒక నివేదికలో తెలిపింది. నకిలీ నోట్ల విషయానికొస్తే గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,96,695 నోట్లు కనుగొన్నట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. అదే సంవత్సరంలో గుర్తించిన రూ.2,000 నకిలీ నోట్ల సంఖ్య 17,020 నోట్లు.