Asianet News TeluguAsianet News Telugu

రైవర్లీ అంటే ఇదేనేమో?!: గూగుల్‌పై అమెజాన్ ప్లస్ ఫ్లిప్‌కార్ట్ గుర్రు

ఏడాది క్రితం వరకు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు తమ ప్రచారం కోసం ఇంటర్నెట్ సెర్చింజన్ ‘గూగుల్’లో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి

A new rivalry brews as Flipkart, Amazon cut Google ad spends

బెంగళూరు: ఫ్లిప్ కార్టు ప్రైవేట్ లిమిటెడ్, అమెజాన్ ఇండియా సంస్థలు భారతదేశంలోనే అతిపెద్ద ఆన్‪లైన్ రిటైల్ సంస్థలు. రెండు సంస్థలూ గూగుల్‌లో వాణిజ్య ప్రకటనల జారీ కోసం రూ. వందల కోట్లు ఖర్చు చేశాయి. కానీ గూగుల్ కూడా ‘ఈ - కామర్స్’ వేదికను ప్రారంభించనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ఆ వెంటనే గూగుల్ సంస్థ అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లకు ప్రత్యర్థి సంస్థగా పరిణమించిందని ఆ సంస్థలు భావించాయి. అంతే. గూగుల్ సంస్థలో వాణిజ్య ప్రకటనలను జారీ చేసేందుకు ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధుల్లో కోత విధించాయి. దీనికితోడు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు తమ వాణిజ్య ప్రకటనల నిధులను ఇతర వేదికలపై ఖర్చు చేస్తున్నాయి. 

గత మూడు నెలలుగా అమెజాన్, ఫ్లిప్ కార్టు సంస్థలు గూగుల్ సంస్థల్లో వాణిజ్య ప్రకటనల జారీకి ఖర్చు చేస్తున్న మొత్తంలో 30 శాతానికి పైగా నిధుల్లో కోత విధించాయి. ఐటీ నిపుణులకు నిలయంగా ఉన్న గూగుల్ ‘ఈ-కామర్స్’ ప్రారంభించనున్నట్లు చేసిన ప్రకటన ఇంకా కార్యరూపం దాల్చలేదు. కానీ అమెజాన్, ఫ్లిప్ కార్టు సంస్థలకు మాత్రం ప్రత్యర్థి సంస్థగా నిలిచింది. 

గూగుల్ సంస్థలో వాణిజ్య ప్రకటనల జారీ నుంచి ఫ్లిప్ కార్టు తప్పుకుంటున్నట్లు పేరు చెప్పడానికి ఇష్ట పడని ఆ సంస్థలు తెలిపాయి. కానీ గూగుల్ మాత్రం వ్యూహాత్మకంగా ఫ్లిప్ కార్టులో పెట్టుబడులు పెట్టాలని వాంచిస్తోంది. ఫ్లిప్ కార్టు నూతన భాగస్వామి వాల్ మార్ట్ కంటే సన్నిహితంగా ఉండాలని గూగుల్ తలపోస్తున్నది. 

గూగుల్ సంస్థలో వాణిజ్య ప్రకటనలను జారీ చేసే విషయమై దాంతోపాటు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ కూడా బహరింగంగా స్పందించేందుకు నిరాకరించాయి. వదంతులపై స్పందించబోమని గూగుల్ అధికార ప్రతినిధి తేల్చి చెప్పారు. అమెజాన్ ప్రతినిధి నిరాకరించారు. ఫ్లిప్ కార్ట్ అసలు ఈ - మెయిల్‌కు స్పందించనే లేదు.

అయితే గూగుల్, ఈ - కామర్స్ వాణిజ్యాన్ని చురుగ్గా విస్తరించాలని ప్రణాళికలు పున:రూపొందిస్తోంది. అయితే తమ ‘ఈ - కామర్స్’లో షాపింగ్ చేసేవారు అమెజాన్‌లో వెతుకుతుంటారని గూగుల్ సందేహిస్తోంది. దీనికి తోడు గూగుల్ కోర్ బిజినెస్ డిజిటల్ అడ్వర్టయిజ్‌మెంట్‌కు కూడా ముప్పు పొంచి ఉన్నది. అమెజాన్ ఇప్పటికే అమెరికా నుంచి బిలియన్ల డాలర్ల ఆదాయం సాధించింది. 

భారతదేశంలోని డిజిటల్ యాడ్స్‌లో మార్కెట్ లీడర్‌గా నిలిచింది. ఫేస్ బుక్ తర్వాత ఫ్లిప్ కార్టు మూడో స్థానంలో నిలిచింది. వచ్చే మార్చి నెలాఖరు నాటికి 200 మిలియన్ల డాలర్ల ఆదాయం సంపాదించాలని అంచనా వేస్తోంది. అమెజాన్ కూడా చురుగ్గా యాడ్స్ వాణిజ్యాన్ని విస్తరించాలని తలపోస్తోంది. గూగుల్ ఈ - కామర్స్ కూడా డిజిటల్ యాడ్స్ విభాగంలో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లకు ప్రాముఖ్యతనిస్తోంది. కానీ కొన్నేళ్ల క్రితం వరకు గూగుల్ కూడా ఈ - కామర్స్‌లో అడుగు పెడుతుందని కానీ, ఇంటర్నెట్ సెర్చింజన్, ఆన్‌లైన్ అడ్వర్టయిజింగ్‌లో గూగుల్‌కు అమెజాన్ పోటీగా, ముప్పుగా పరిణమిస్తుందని ఎవరూ ఊహించలేదు. 

ఇప్పటికే ఈ - కామర్స్ రంగంలో సేవలందిస్తున్న సంస్థలతోపాటు గూగుల్ రిటైల్ రంగ ప్రవేశం చేయడంతో నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తుందని ఆర్థికవేత్తలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 2017లో ఈ - కామర్స్ మార్కెట్ 28 శాతం పెరిగి 18 బిలియన్ల డాలర్లకు చేరుకున్నది. త్వరితగతిన విక్రయాలను పెంచుకునేందుకు ఈ - కామర్స్ సంస్థలు కష్టపడుతున్నాయి. ఫ్లిప్ కార్ట్, అమెజాన్, పేటిఎం మాల్ భారీ నష్టాలను చవి చూస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios