Asianet News TeluguAsianet News Telugu

ఒక బిచ్చగాడు ఇప్పుడు బిలియనీర్.. 35 కార్లు, 150కి పైగా ఉద్యోగులు..

జీవితంలో ఏదైనా సాధించాలని నిరంతరం ప్రయత్నిస్తే ఏ పనినైనా సాధించవచ్చని పెద్దలు చెబుతారు. చాలా మంది పారిశ్రామికవేత్తలు ఇది నిజమని నిరూపించారు. అందుకు ఈ వ్యాపారవేత్త మంచి ఉదాహరణ. బెంగళూరులో భిక్షాటన చేసే ఓ వ్యక్తి ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారి.
 

A beggar in Bengaluru is now a billionaire, breadwinner for over 150 employees-sak
Author
First Published Dec 11, 2023, 6:12 PM IST

జీవితంలో ఏదైనా సాధించాలని నిరంతరం ప్రయత్నిస్తే ఏ పనినైనా సాధించవచ్చని పెద్దలు చెబుతుంటారు. చాలా మంది పారిశ్రామికవేత్తలు దీన్ని  నిజమని నిరూపించారు. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త రేణుకా ఆరాధ్య అందుకు మంచి ఉదాహరణ. బతుకుదెరువు కోసం వీధుల్లో భిక్షాటన చేసేవాడు. కానీ ఈరోజు తన కృషి, అంకితభావం వల్ల రూ.40 కోట్ల విలువైన కంపెనీని సొంతం చేసుకున్నాడు. 

రేణుకా ఆరాధ్య కర్ణాటకలోని బెంగళూరు సమీపంలోని ఒక చిన్న గ్రామానికి చెందినవారు. చాలా పేద కుటుంబంలో జన్మించిన అతని కుటుంబం పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది, తన 10 వ తరగతి పూర్తి చేసిన తర్వాత రేణుకా ఆరాధ్య కుటుంబ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి వివిధ ఇళ్లలో పనికి తర్వాత ఇంటింటికీ వెళ్లి బియ్యం, పిండి, పప్పు కోసం అడుక్కోవాల్సి వచ్చింది. అయితే, జీవితాన్ని నిర్వహించడం కష్టంగా మారింది. అలా సెక్యూరిటీ గార్డు ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగం వచ్చింది.

 ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో చేరాక  పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు రేణుక ఆరాధ్య  వయసు కేవలం 20 ఏళ్లు. పెళ్లయితే అదనపు బాధ్యత మరింత కష్టపడి పనిచేసేలా పురికొల్పుతుందని నమ్మాడు. అందుకు తగిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ప్లాస్టిక్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన వచ్చింది. సూట్‌కేస్ కవర్లను విక్రయించాలని నిర్ణయించుకున్నారు. కానీ వారు అనుకున్నట్లుగా పనులు జరగలేదు. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ సుమారు రూ.30 వేల వరకు నష్టం వాటిల్లింది. కానీ డబ్బులు రికవరీ చేయలేకపోయాడు.

అలా డ్రైవింగ్ నేర్చుకుని ఓ ట్రావెల్ ఏజెన్సీలో డ్రైవర్ గా ఉద్యోగం సంపాదించాడు. విదేశీ పర్యాటకులను ఎక్కడికైనా తీసుకెళ్లేవారు. 4 సంవత్సరాల పాటు ట్రావెల్ ఏజెన్సీలో పని చేసిన తర్వాత, అతను  స్వంత ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ప్రవాసీ క్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక కంపెనీని ప్రారంభించారు. ఇందుకోసం సొంత డబ్బు పెట్టి కొన్ని బ్యాంకుల సాయం తీసుకున్నారు. 


 మొదట కారు కొన్నాకా  ఏడాది తర్వాత మరో కారు కొన్నాడు. ఇంతలో ఓ ట్రావెల్ ఏజెన్సీ తన వ్యాపారాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దింతో  6 లక్షలకు రేణుకా ఆరాధ్య ఆ వ్యాపారాన్ని  కొనుగోలు చేసింది. ఆ సమయంలో కంపెనీకి 35 క్యాబ్‌లు ఉండేవి.

ఇక ఇక్కడి నుంచి రేణుక ఆరాధ్య జాతకం మారిపోయింది. దీని తర్వాత అమెజాన్ ఇండియా  ప్రమోషన్ కోసం తన కంపెనీని ఎంచుకుంది. వాల్‌మార్ట్ అండ్ జనరల్ మోటార్స్ వంటి కంపెనీలు కూడా వారితో కలిసి పనిచేయడం ప్రారంభించాయి. క్రమంగా కంపెనీ టర్నోవర్ పెరగడం మొదలైంది. రూ.40 కోట్లు  వరకు చేరుకుంది ఈరోజు రేణుకా ఆరాధ్య దగ్గర 150 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios