నేడు కేబినెట్‌ సమావేశంలో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు హోలీ కానుక లభించనుంది. ఈ సమావేశంలో ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్(DA) మూడు శాతం పెంచడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని  అవకాశం ఉందని ఒక నివేదిక తెలిపింది.

నేడు బుధవారం కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వం హోలీ కానుకగా ఇవ్వవచ్చు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నేడు జరగనున్న కేబినెట్ సమావేశంలో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి భారీ ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఓ నివేదిక వెల్లడించింది. ఇందులో కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపును ప్రకటించే అవకాశం ఉంది. 

డియర్‌నెస్ అలవెన్స్
డియర్‌నెస్ రిలీఫ్ బకాయిలతో పాటు హౌసింగ్ రెంటల్ అలవెన్స్ (HRA) పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎదురు చూస్తున్నారని గమనించాలి. డి‌ఏ, ప్రభుత్వ రంగ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చే జీవన వ్యయ భత్యం జనవరి నుండి జూలైలో సంవత్సరానికి రెండుసార్లు పెంచబడుతుంది. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులకు 31 శాతం డియర్‌నెస్ అలవెన్స్ ఇస్తుండగా, అందులో మూడు శాతం పెంపుదల ప్రకటించవచ్చు. దీని తర్వాత మొత్తం డియర్‌నెస్ అలవెన్స్ 34 శాతానికి పెరుగుతుంది.

ఏడవ వేతన సంఘం సిఫార్సు ఆధారంగానే డీఏ పెంపుపై ప్రభుత్వ ప్రకటన ఉంటుంది. ఉద్యోగుల జీతం ఆధారంగా డియర్‌నెస్ అలవెన్స్ ఇస్తారు. అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ భిన్నంగా ఉంటుంది. దీనిని ప్రాథమిక వేతనంపై లెక్కించబడుతుంది. ఇంతకుముందు వచ్చిన నివేదికలను పరిశీలిస్తే, హోలీకి ముందు, డీఏ పెంపుపై ప్రకటన చేయడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగులకు పెద్ద బహుమతి ఇవ్వనుందని భావించారు. దీనికి సంబంధించి విడుదల చేసిన నివేదిక ప్రకారం.. పెరిగిన జీతం, జనవరి, ఫిబ్రవరి బకాయిలతో పాటు మార్చిలో ఉద్యోగులకు అందజేయనున్నారు. 

 ప్రస్తుతం, మొత్తం డియర్‌నెస్ అలవెన్స్ 31 శాతంగా ఉంది, అయితే ఈ ప్రకటన తర్వాత 34 శాతానికి పెరగవచ్చు. డియర్నెస్ అలవెన్స్  34 శాతానికి పెంచితే జీతం 20 వేల రూపాయలు పెరిగే అవకాశం ఉంది. 7వ కేంద్ర వేతన సంఘం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల డీఏ బేసిక్ పే ఆధారంగా నిర్ణయించబడుతుంది. అక్టోబర్‌లో 3 శాతం, జూలైలో 11 శాతం పెరిగిన తర్వాత ప్రస్తుత డీఏ రేటు 31 శాతానికి చేరుకుంది. డియర్‌నెస్ అలవెన్స్ ఉద్యోగి జీతం, పెన్షనర్ల పెన్షన్‌లో ప్రధాన భాగాన్ని ఏర్పరుస్తుంది

ఈ భత్యం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి జీతాలపై ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడానికి ఇవ్వబడుతుంది. 7వ వేతన సంఘం (7వ CPC) కింద ప్రభుత్వం జనవరి, జూలైలలో సంవత్సరానికి రెండుసార్లు డి‌ఏలో ఇంక్రిమెంట్ ఇస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల స్థానాల ఆధారంగా కూడా డీఏ మారుతుంది.

48 లక్షల మంది ఉద్యోగులకు బెనిఫిట్
నివేదిక ప్రకారం, ప్రభుత్వం జీతాల పెంపును ప్రకటిస్తే, భారతదేశం అంతటా దాదాపు 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. గతేడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్  28 శాతం నుంచి 31 శాతానికి ప్రభుత్వం పెంచింది. కోవిడ్ -19 మహమ్మారి ఉన్నప్పటికీ ఉద్యోగులకు డిఎ ఇంక్రిమెంట్ ఇవ్వబడింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.