Asianet News TeluguAsianet News Telugu

ఫోర్బ్స్ అత్యంత ధనవంతుల లిస్ట్‌లో ఏడుగురు ఇండో-అమెరికన్లకు చోటు..

ఈ ఫోర్బ్స్ యునైటెడ్ స్టేట్స్ అత్యంత ధనవంతుల లిస్ట్‌లో ఏడుగురు భారతీయ-అమెరికన్లకు చోటు దక్కడం విషేషం. 56 ఏళ్ల అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ 179 బిలియన్ డాలర్ల సంపదతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.  మరోసారి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా జెఫ్ బెజోస్‌ నిలిచారు. 

7 Indo-Americans in Forbes 2020 list of richest people in US
Author
Hyderabad, First Published Sep 9, 2020, 1:57 PM IST

అమెరికాలో  అత్యంత ధనవంతుల జాబితాను ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ప్రకటించింది. ఈ ఫోర్బ్స్ యునైటెడ్ స్టేట్స్ అత్యంత ధనవంతుల లిస్ట్‌లో ఏడుగురు భారతీయ-అమెరికన్లకు చోటు దక్కడం విషేషం. 56 ఏళ్ల అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ 179 బిలియన్ డాలర్ల సంపదతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.  

మరోసారి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా జెఫ్ బెజోస్‌ నిలిచారు. జెఫ్ బెజోస్ వరుసగా మూడవ సంవత్సరం కూడా అగ్రస్థానంలో నిలుస్తూ ఫోర్బ్స్ 2020 జాబితాలో అమెరికాకు చెందిన 400 మంది ధనవంతులు ఉన్నారు.

సైబర్‌ సెక్యూరిటీ సంస్థ జెడ్‌స్కేలర్‌ సీఈఓ జై చౌదరీ, సింపనీ టెక్నాలజీ గ్రూపు ఛైర్మన్‌ రమేశ్‌ వాద్వాని, వేఫెయిర్‌ సీఈఓ నీరజ్‌ శా, కోశ్లా వెంచర్స్‌ వ్యవస్థాపకుడు వినోద్‌ కోశ్లా, షేర్‌పాలో వెంచర్స్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ కవిటర్క్‌ రామ్‌ శ్రీరామ్‌, రాకేశ్‌ గాంగ్వాల్‌, వర్క్‌డే సీఈఓ అనిల్‌ భూశ్రీ ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

also read రిల‌య‌న్స్ రిటేల్‌లో మరోసారి సిల్వ‌ర్ లేక్ భారీ పెట్టుబ‌డులు.. ...

111 బిలియన్ డాలర్లతో  సెకండ్‌ ప్లేస్‌లో బిల్‌గేట్స్‌, 8వేల 5వందల కోట్ల డాలర్లతో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ మూడవ స్థానం సంపాదించారు. 7వేల 350 కోట్ల డాలర్లతో వారెన్‌ బఫెట్‌, 7వేల 2 వందల కోట్ల డాలర్లతో ఒరాకిల్‌ ఛైర్మన్‌ లారీ ఎల్లిసన్‌ తర్వాతి స్థానాల్లో నిలిచారు.

ఐతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం ఈసారి కిందికి దిగజారారు. 2.5 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో 339వ స్థానాన్ని దక్కించుకున్నారు. 400 మంది ధనవంతులైన అమెరికన్ల  మొత్తం సంపద ఈ ఏడాది 240 బిలియన్ డాలర్లు పెరిగిందని ఫోర్బ్స్ తెలిపింది.

అమెరికాలోని ధనవంతుల ఫోర్బ్స్ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నారు. అతను 2.5 బిలియన్ డాలర్ల నికర సంపదతో 339వ స్థానంలో ఉన్నాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios