2023లో భారత్ వదిలి విదేశాల్లో సెటిల్ అయ్యేందుకు 6500 మంది మిలియనీర్లు సిద్ధం..ధనవంతులు ఎందుకు ఇలా చేస్తున్నారు

మన దేశానికి చెందిన మిలియనీర్లు విదేశాలకు వలస వెళ్లిపోతున్నారు. అవును మీరు వింటున్నది నిజమే. గతంలో బ్రెయిన్ డ్రెయిన్ పేరిట మేధావులంతా విదేశాల బాట పడితే ఇప్పుడు సంపన్నులు సైతం విదేశాల్లో స్థిరపడేందుకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

6500 millionaires are ready to leave India and settle abroad in 2023 Why are the rich doing this MKA

2023 సంవత్సరంలో సుమారు  6500 మంది మిలియనీర్లు భారత్ విడిచి ఇతర దేశాల్లో  స్థిరపడాలని ఆలోచిస్తున్నారు. వీరంతా దుబాయ్, సింగపూర్ దేశాల్లో స్థిరపడాలని ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టు హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ 2023 నివేదిక పేర్కొంది.  గత సంవత్సరం అయితే ఇది మరింత ఎక్కువగా ఉందని అప్పుడు ఏకంగా 7,500 మంది మిలియనీర్ భారతీయులు దేశం విడిచి వేరే చోట స్థిరపడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

సుమారు 6500 మంది భారతీయులు 2023లో దేశం విడిచి భారతదేశంలో ఎక్కడైనా స్థిరపడాలని యోచిస్తున్నన్నట్లు తాజాగా ఈ నివేదిక తెలిపింది.. అయితే, 2022తో పోల్చితే ఈ సంఖ్య 1,000 తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 

హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ 2023 ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సంపద, పెట్టుబడి వలసలను ట్రాక్ చేసే కంపెనీ, గత సంవత్సరం 7,500 మంది మిలియనీర్ భారతీయులు దేశం విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. .

ఈ నివేదిక ప్రకారం, దేశం విడిచిపెట్టిన మిలియనీర్ల విషయంలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. ఈ జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉంది, ఇక్కడ 13,500 మంది మిలియనీర్లు దేశం విడిచి వేరే చోట నివాసం పెట్టారు. ఇక రష్యా  మూడో స్థానంలో ఉంది. సుమారు 8,500 మంది మిలియనీర్లు  2022లో ఉక్రెయిన్ దాడి తర్వాత విదేశాలకు వలస వెళ్లిపోయారు. 

మిలియనీర్లు భారతదేశాన్ని ఎందుకు విడిచిపెడుతున్నారు?

హెన్లీ పార్ట్‌నర్స్‌లోని ప్రైవేట్ క్లయింట్ల గ్రూప్ హెడ్ డొమినిక్ వోలెక్ దీనిపై స్పందించారు.ఇటీవలి కొనసాగుతున్న గందరగోళం ఈ మార్పుకు కారణమైంది అంటున్నారు. చాలా మంది పెట్టుబడిదారులు భద్రతతో పాటు, విద్య, ఆరోగ్య సంరక్షణ, వాతావరణ మార్పులు, దాంతో పాటు ప్రధానంగా క్రిప్టో స్నేహపూర్వక వాతావరణం వంటి కారణాల వల్ల తమ కుటుంబాలను వేరే దేశానికి మార్చాలని ఆలోచిస్తున్నారు.

భారతదేశంలోని అధిక పన్నులు కూడా మిలియనీర్లను ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది. పన్నులు అధికంగా ఉన్న నేపథ్యంలో టాక్స్ హెవెన్ దేశాలకు భారతీయులు తమ పెట్టుబడులను  తరలించేందుకు సిద్ధం అవుతున్నాయని నివేదిక పేర్కొంది.

నివేదిక ప్రకారం, దుబాయ్, సింగపూర్‌లు సంపన్న భారతీయ కుటుంబాలకు ఇష్టమైన గమ్యస్థానాలుగా కొనసాగుతున్నాయన్నారు. ముఖ్యంగా దుబాయిలోని. గోల్డెన్ వీసా ప్రోగ్రామ్, అనుకూలమైన టాక్స్ వాతావరణం, బలమైన బిజినెస్ ఎకో సిస్టం, సురక్షితమైన, శాంతియుత వాతావరణం వంటి ప్రోత్సాహకాలు ఈ దేశాలను స్థిరపడేందుకు అగ్ర స్థానాలుగా మార్చాయి.

ఇప్పటికే భారతీయులు  బ్రెయిన్ డ్రెయిన్ కారణంగా అమెరికా,  ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలకు నిపుణులను కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ మిలియనీర్ల వలస కూడా దేశంలో పెట్టుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  అయితే భారతదేశంలో  ఆర్థిక విధానాలను మరింత సరళీకృతం చేయడం ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షించే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios