Mutual Fund Investment: స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడం రిస్కుగా భావిస్తున్నారా. అయితే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం బెస్ట్ అని నిపుణులు పేర్కొంటున్నారు. మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ తక్కువగా ఉండటంతో పాటు రిటర్నులు సైతం ఎక్కువగానే ఉంటాయి. గత రెండేళ్లలో డబుల్ రిటర్న్ అందించిన టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్ పై ఓ లుక్కేద్దాం.
Mutual Fund Investment: స్టాక్ మార్కెట్లో పెట్టుబుడుల రిస్క్ తో కూడినవి, అయితే స్టాక్స్ లో పెట్టుబడి పెట్టాలన్న, ఫ్యూచర్స్, ఆప్షన్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న నాలెడ్జ్ చాలా అవసరం. లేకుంటే మీరు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. కొత్తగా మార్కెట్లో ప్రవేశించేవారికి మ్యూచువల్ ఫండ్స్ మంచి ఆప్షన్, లాంగ్ టర్మ్ మదుపు చేయడం ద్వారా మార్కెట్ రిస్క్ ఎక్కువగా ఉండదు. అయితే సరైన మ్యూచువల్ ఫండ్ సరైన స్కీమ్‌ను ఎంచుకోవడం మీ ఇన్వెస్ట్ మెంట్ కు మంచి రిటర్న్ అందుతుంది. కొన్ని సెక్టార్లకు చెందిన ఫండ్స్ మదుపుదారులకు మంచి రాబడిని అందిస్తున్నాయి. ఈ ఫండ్ స్కీముల్లో కొన్ని కేవలం రెండేళ్లలోనే డబ్బును రెట్టింపు చేశాయి. ఆ ఫండ్స్ ఏవో తెలుసుకుందాం. ఈ ఫండ్స్ ఏయే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేశాయో కూడా తెలుసుకుందాం.
1. SBI Technology Opportunities Fund
మార్చి 2020 నుండి ఫిబ్రవరి 23 నుంచి 2022 వరకు ఫండ్ చాలా మంచి పెర్ఫార్మన్స్ అందించింది. రెండేళ్లలో దాదాపు 188 శాతం రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ తన డబ్బులో దాదాపు 20 శాతం విదేశీ టెక్నాలజీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టింది. వీటిలో ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, నెట్‌ఫ్లిక్స్ ఉన్నాయి. గత ఏడాది కాలంలో మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్‌లో దాదాపు 20-25 శాతం పెట్టుబడి పెట్టింది.
2. SBI Magnum Comma Fund
ఈ ఫండ్ కూడా ఇన్వెస్టర్లను సంతోషపరిచింది. మార్చి 2020 నుండి ఫిబ్రవరి 2022 వరకు దీని రాబడి 172 శాతంగా ఉంది. ఈ ఫండ్ మెటల్, సిమెంట్ కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టింది. దీని పోర్ట్‌ఫోలియోలో బలరాంపూర్ చినీ మిల్స్, నియోజనే కెమికల్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, నేషనల్ అల్యూమినియం, టాటా స్టీల్ ఉన్నాయి. వీటిలో నియోజెన్ కెమికల్స్ రెండేళ్లలో 332 శాతం రాబడిని ఇచ్చింది.
3.DSP Natural Resources & New Energy Fund
గత రెండేళ్లలో ఈ ఫండ్ రాబడి 171 శాతం రాబడి అందించింది. ఈ ఫండ్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఇటిఎఫ్‌లలో దాదాపు 25 శాతం పెట్టుబడి పెట్టింది. భారతీయ కంపెనీలలో ఆయిల్ ఇండియా, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, సన్ ఫార్మా. ఓఎన్‌జిసిలలో పెట్టుబడులు పెట్టింది. వీటిలో హిందాల్కో గత రెండేళ్లలో 158 శాతం రిటర్నులు ఇచ్చింది.
4. HSBC Infrastructure Equity Fund
ఈ ఫండ్ తన డబ్బులో మూడింట రెండు వంతుల కమోడిటీ-లింక్డ్ స్మాల్‌క్యాప్ కంపెనీలలో పెట్టుబడి పెట్టడం ద్వారా చాలా లాభపడింది. మార్చి 2020 నుండి ఫిబ్రవరి 23, 2022 మధ్య కాలంలో దీని రాబడి 165 శాతంగా ఉంది. ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్, APL అపోలో ట్యూబ్స్, కార్బోరండమ్ యూనివర్సల్, గుజరాత్ గ్యాస్, KIE ఇండస్ట్రీస్ దాని పోర్ట్‌ఫోలియోలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న కంపెనీలు. వీటిలో ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ రెండేళ్లలో 339 శాతం రాబడిని ఇచ్చింది.
5. ICICI Pru India Opportunities Fund
గత రెండేళ్లలో దీని రాబడి 166 శాతం. ఫార్మా, కమోడిటీ కంపెనీల స్టాక్స్‌లో మంచి పెట్టుబడులు పెట్టింది. ఆయిల్ ఇండియా, హిండాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, సన్ ఫార్మా మరియు ONGC వంటి ప్రధాన కంపెనీలు దాని పోర్ట్‌ఫోలియోలో చేర్చబడ్డాయి. వీటిలో హిందాల్కో రెండేళ్లలో 158 శాతం రిటర్నులు ఇచ్చింది.
