Asianet News TeluguAsianet News Telugu

గ్రామీణ ప్రాంతాల ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా ‘బరోడా కిసాన్‌ పక్వాడా’4వ ఎడిషన్‌ ప్రారంభించిన బరోడా బ్యాంక్‌

16  జోనల్‌ ఆఫీసుల పరిధిలో సెంటర్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ మార్కెటింగ్‌ అండ్‌ ప్రాసెసింగ్‌ (CAMP) ప్రారంభించిన  బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.

4th edition of Bank of Barodas Baroda Kisan Pakhwada aims at economic upliftment in rural sector
Author
Hyderabad, First Published Oct 22, 2021, 5:00 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్‌, 22 అక్టోబర్‌ 2021: భారతదేశపు ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన బ్యాంకు ఆఫ్‌ బరోడా (BoB) ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా నేడు బరోడా కిసాన్‌ దివాస్‌(baroda kisan diwas)ను ఘనంగా ప్రారంభించింది. రైతులతో పక్షం రోజుల పాటు నిర్వహించే బరోడా కిసాన్‌ పక్వాడా 4వ ఎడిషన్‌కు  నేడు శ్రీకారం చుట్టుంది. ఫుడ్‌ అండ్‌ ఆగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (FAO) ఆలోచనలకు అనుగుణంగా ఈ సంవత్సరపు కార్యక్రమాన్ని ‘మన చర్యలే మన భవిష్యత్‌’ పేరుతో నిర్వహించడం జరుగుతుంది.  మన దేశ ఆర్థిక ప్రగతికి రైతు సమాజం అందిస్తున్న తోడ్పాటును ఈ కార్యక్రమం ద్వారా గుర్తించి ప్రశంసించడంతో పాటు దీని ద్వారా రైతులకు చేరవయ్యేందుకు రకరకాల ఈవెంట్స్, నాలెడ్జ్ సిరీస్‌, సన్మాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. భారతదేశవ్యాప్తంగా పక్షం రోజులపాటు సాగే ఈ కార్యక్రమం 31 అక్టోబర్‌ 2021న ముగుస్తుంది. దీని నుంచి  వివిధ మాధ్యమాల ద్వారా పెద్ద సంఖ్యలో రైతులకు లబ్ది చేకూరుతుంది. 

దేశవ్యాప్తంగా ఉన్న దాని 18 జోనల్‌ కార్యాలయాల్లో "సెంటర్‌ ఫర్ ఆగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ అండ్‌ ప్రాసెసింగ్‌ (CAMP) కొత్త కేంద్రీకృత వ్యవసాయ రుణాల ప్రాసెసింగ్‌ కేంద్రాలను బ్యాంకు ప్రారంభించింది. సంప్రదాయేతర వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ మార్కెటింగ్‌ కార్యకలాపాలపై దృష్టి సారించే రుణ పంపిణీ వ్యవస్థ CAMP. అధిక విలువ రుణఖాతాల నిర్వహణను అర్థం చేసుకొని, వాటిని నిర్వహించే సామర్ధ్యం కలిగిన సుశిక్షితులైన సిబ్బంది ఉంటారు. నాణ్యమైన వ్యాపారం కోసం స్థానిక సంస్థలతో సహకారాన్ని కూడా బ్యాంకు ప్రోత్సహిస్తుంది. 

also read ఇ-ఆధార్ కార్డు అంటే ఏంటి, దాని వల్ల ఉపయోగం ఏమిటి..? ఆధార్ కార్డుతో సమానంగా ఉంటుందా..?

ఈ సందర్భంగా హైదరాబాద్‌ జోన్‌ జనరల్‌ మేనేజర్‌ శ్రీ మన్‌మోహన్ గుప్తా మాట్లాడుతూ, “ఆర్థిక సంవత్సరం 2021-22లో మా రుణ అభివృద్ధిలో వ్యవసాయ రంగం ప్రధానంగా ఉంది. వ్యవసాయ రంగంలో గోల్డ్ లోన్స్, సెల్ఫ్‌ హెల్ప్ గ్రూప్‌ ఫైనాన్స్‌కు మేము ప్రాధాన్యత ఇస్తున్నాం.  గోల్డ్‌ లోన్‌ సెగ్మెంట్‌లో మేము వార్షిక రూపేణ 11% ఎదుగుదల అంటే రూ.650.00 కోట్లు, స్వయం సహాయక బృందాల సెగ్మెంట్‌లో 6% అంటే రూ.54.96 కోట్ల ఉన్నతిని చూశాం.  కొవిడ్‌ మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుంటుండటంతో వ్యవసాయ రంగంలో మేము బలమైన వృద్ధిని ఊహిస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు  వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు అనేక ప్రయోజనాలు కల్పిస్తూ ప్రోత్సహించడంతో పాటు వ్యవసాయ మౌలిక సదుపాయాలను (గిడ్డంగులు, కోల్డ్‌ స్టోరేజ్‌ల నిర్మాణం, ఆహారం, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ కోసం ఎస్‌ఈజడ్‌ల వంటివి) అభివృద్ధిపరుస్తున్నాయి. ఈ ప్రయోజనాలను అందిపుచ్చుకునేందుకు బ్యాంకులకు అవకాశం ఏర్పడుతోంది” అన్నారు.

గడిచిన మూడు సంవత్సరాలుగా మా జోన్‌ పరిధిలోని బ్రాంచులు/రీజియన్స్,  బరోడా కిసాన్ పక్వాడాలో (బికేపీ) చురుగ్గా పాల్గొంటూ ఖాతాదారులకు చేరువ అవుతూ గ్రామీణ రైతుల అవసరాలు అర్థం చేసుకొని సకాలంలో రుణసదుపాయాన్ని సమకూర్చుతున్నాయి.  ఈ సంవత్సరం కూడా మా జోన్ పరిధిలో పండగ మాదిరిగా బీకేపీ నిర్వహించి  క్రెడిట్‌ క్యాంపులు, చౌపల్స్, పశువుల ఆరోగ్య పరీక్షలు, ఆర్థిక సాక్షరత క్యాంపుల ద్వారా గరిష్ఠ సంఖ్యలో ఖాతాదారులకు చేరవవుతాం.

Follow Us:
Download App:
  • android
  • ios