Asianet News TeluguAsianet News Telugu

బ్రిటన్ లో ఉద్యోగులకు పండగ, వారానికి 3 రోజుల సెలవు, 4 రోజులే వర్కింగ్ డేస్..మాంద్యానికి విరుగుడు ఇదేనా..?

ఓవైపు ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం దెబ్బతో భయపడుతూ ఉంటే మరోవైపు బ్రిటన్లో మాత్రం ఉద్యోగులకు వారానికి మూడు రోజుల పాటు సెలవులు ఇచ్చేందుకు కంపెనీలు సిద్ధం అవుతున్నాయి. అంటే వారంలో కేవలం నాలుగు రోజులు మాత్రమే పని ఉంటుంది. ఇలా చేయడం వల్ల తమ కంపెనీ ప్రొడక్టివిటీ పెరుగుతోందని కంపెనీలు వాదిస్తున్నాయి.

4 days work in Britain  100 companies gave facility of 4 day working week during retrenchment
Author
First Published Nov 29, 2022, 1:45 PM IST

ఓవైపు ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం వస్తుందన్న భయంతో గజగజా వణుకుతూ ఉంది. ఇప్పటికే అగ్ర రాజ్యం లోని పలు కార్పొరేట్ సంస్థలు, వేలసంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కానీ  వినూత్నంగా బ్రిటన్లో మాత్రం కొత్త ప్రయోగంతో ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు  ప్రయత్నాలు సాగుతున్నాయి.  ఇందులో భాగంగా ఉద్యోగులకు వారానికి నాలుగు వర్కింగ్ డేస్, మూడు సెలవుల విధానాన్ని  100 కంపెనీలు  అమలు చేస్తున్నాయి. ఇలా చేయడం వల్ల తమ కంపెనీ ఉత్పాదకత పెరుగుతోందని అంచనా వేశాయి. విశేషమేమిటంటే, ఈ కంపెనీలు ఉద్యోగులందరికీ వారి జీతం మినహాయించకుండా ఈ నాలుగు రోజుల  పని, మూడురోజుల సెలవులను ప్రకటించాయి.

ఈ 100 కంపెనీలు వారానికి 4 రోజులు పని చేయడం ద్వారా దేశంలో పెద్ద మార్పును తీసుకురాగలమని నమ్ముతున్నాయి. ఈ 100 కంపెనీల్లో దాదాపు 2,600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇలా వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేయడం ద్వారా,  ఉద్యోగులు ఒత్తిడి లేకుండా పని చేస్తారని,  లాంగ్ వీకెండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత,  రెట్టించిన ఉత్సాహంతో పని చేసే వీలుందని,  హ్యూమన్ రిసోర్స్ విభాగం తెలిపింది. 

ఇప్పటికే  బ్రిటన్  రెండు అతిపెద్ద సంస్థలు ఆటమ్ బ్యాంక్,  గ్లోబల్ మార్కెటింగ్ సంస్థ అవిన్ ఈ 4 రోజుల పని సంస్కృతిని అనుసరిస్తున్నాయి. ఈ రెండు కంపెనీలకు UKలో దాదాపు 450 మంది ఉద్యోగులు ఉన్నారు. 

Avin చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆడమ్ రాస్, ది గార్డియన్‌తో మాట్లాడుతూ - "మేము ఒక కొత్త పని విధానాన్ని అనుసరించడం ద్వారా కస్టమర్ సర్వీస్‌ను మెరుగుపరచడమే కాకుండా తక్కువ భారంతో ఉద్యోగుల ప్రతిభకు పదును పెట్టగలగుతున్నామని తెలిపారు. 

బ్రిటన్‌లోని ఈ 100 కంపెనీలు మాత్రమే కాదు, ప్రపంచంలోని మరో 70 కంపెనీలు కూడా 4 రోజుల పని విధానాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేస్తున్నాయి. ఇది ఇంకా ట్రయల్ దశలోనే ఉంది. ఈ కంపెనీల్లో దాదాపు 3,300 మంది పనిచేస్తున్నారు. కేంబ్రిడ్జ్,  ఆక్స్‌ఫర్డ్‌తో పాటు బోస్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ అంశంపై పరిశోధన చేస్తున్నారు.

80కి పైగా కంపెనీలు తమ వ్యాపారానికి 4 రోజుల పని బాగా పనిచేస్తుందని సంతృప్తిని వ్యక్తం చేశారు, నాలుగు-రోజుల వారాన్ని అడాప్ట్ చేసుకోవడంతో పనితీరు ఊపందుకుంటున్నదని తెలిపారు.

అటు భారత్ లో కూడా  వారానికి నాలుగు రోజుల పని విధానం అమలు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి, కొత్త లేబర్ కోడ్ విధానాల్లో కూడా వారానికి నాలుగు రోజుల పని పై,  చర్చ జరుగుతోంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios