Asianet News TeluguAsianet News Telugu

ఫిబ్ర‌వ‌రి 2-4 తేదీల మ‌ధ్య హైద‌రాబాద్‌లో 25వ జాతీయ హెచ్ఆర్‌డీ స‌ద‌స్సు

జాతీయ మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్ఆర్‌డీ) భార‌త‌దేశంలోని హైద‌రాబాద్ న‌గ‌రంలో ఫిబ్ర‌వ‌రి 2-4 తేదీల మ‌ధ్య 25వ వార్షిక స‌దస్సును నిర్వ‌హించ‌నుంది. ఈ సదస్సులో తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రారంభించి 'ఆర్థిక భవిష్యత్తును డీకోడింగ్ చేయడం: 5టీ ఎకానమీకి ఉత్ప్రేరకంగా హైదరాబాద్' అనే అంశంపై కీలకోపన్యాసం చేయనున్నారు. 

25th National HRD Conference at Hyderabad from 2-4 February
Author
First Published Jan 30, 2023, 9:03 PM IST

జాతీయ మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్ఆర్‌డీ) భార‌త‌దేశంలోని హైద‌రాబాద్ న‌గ‌రంలో ఫిబ్ర‌వ‌రి 2-4 తేదీల మ‌ధ్య 25వ వార్షిక స‌దస్సును నిర్వ‌హించ‌నుంది. వెయ్యి మందికి పైగా అతిథులు, 110 మందికి పైగా వ‌క్త‌లు ఇందులో పాల్గొంటారు. ఈ సంవ‌త్స‌రం జ‌రిగే స‌ద‌స్సు దేశంలోని హెచ్ఆర్ కార్య‌క్ర‌మాల‌న్నింటిలోకీ అతి పెద్ద‌ది. ఈ స‌ద‌స్సులో హెచ్ఆర్ ప్ర‌ముఖులు, నిపుణులు, దేశ‌వ్యాప్తంగా ఉన్న వృత్తి నిపుణులు పాల్గొని,  "డీకోడ్ ద ఫ్యూచ‌ర్" అనే అంశంపై చ‌ర్చిస్తారు. హైదరాబాద్ లోని హెచ్ ఐసీసీ నోవాటెల్ లో ఎన్ హెచ్ ఆర్ డీ సదస్సు జరగనుంది.

ఈ సదస్సును తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రారంభించి 'ఆర్థిక భవిష్యత్తును డీకోడింగ్ చేయడం: 5టీ ఎకానమీకి ఉత్ప్రేరకంగా హైదరాబాద్' అనే అంశంపై కీలకోపన్యాసం చేయనున్నారు. 

మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సాహభరితమైన‌ కార్యక్రమానికి పరిశ్రమ నిపుణులు డాక్టర్ విపుల్ సింగ్ (ఎన్‌హెచ్ఆర్‌డి హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్) నాయకత్వం వహించడం, జాతీయ చాప్టర్ అధ్యక్షుడు ఎస్.వి.నాథన్, కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీని వుడుముల ఈ బృహత్తర కార్యక్రమాన్ని నడిపిస్తారు. హాజరైనవారికి తాజా హెచ్ఆర్‌ ధోరణులు, వ్యూహాలు, సాంకేతికతల గురించి తెలుసుకోవడానికి, తోటివారితో అర్థవంతమైన చర్చల్లో నిమగ్నం కావడానికి అవకాశం ఉంటుంది. ఈ స‌ద‌స్సులో పాల్గొనేవారికి సంబంధాలను పెంపొందించుకోవడానికి, వారి వృత్తిప‌ర‌మైన‌ నెట్ వర్క్ లను విస్తరించడానికి బోలెడ‌న్ని అవకాశాలను అందిస్తుంది.

“25వ ఎన్‌హెచ్ఆర్‌డీ సదస్సుకు ఆతిథ్యమివ్వడం, హెచ్ఆర్ ప్రొఫెషనల్స్ కు భవిష్యత్తును డీకోడ్ చేసే అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది” అని ఎన్‌హెచ్ఆర్‌డీ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ విపుల్ సింగ్ అన్నారు. “హెచ్ఆర్ లీడర్లు నేర్చుకోవడానికి, ఎదగడానికి, ప్రేరణ పొందడానికి ఒక స్థలాన్ని సృష్టించడమే మా లక్ష్యం. హెచ్ఆర్ ప్రొఫెషనల్స్ కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, అర్థవంతమైన కనెక్షన్లు పొంద‌డానికి ఈ కాన్ఫరెన్స్ ఒక విలువైన అవకాశం అవుతుందని మేం విశ్వసిస్తున్నాము” అని ఆయ‌న తెలిపారు.

హెచ్ఆర్ నిపుణులు కొత్త దృక్పథాలను పొందడానికి, వారి పరిజ్ఞానాన్ని విస్తృతం చేసుకోడానికి, అర్థవంతమైన కనెక్షన్లను పొంద‌డానికి ఎన్‌హెచ్ఆర్‌డీ స‌ద‌స్సు ఒక మంచి వేదిక అవుతుంది. భవిష్యత్తును డీకోడ్ చేయడంపై దృష్టి సారించడం ద్వారా, ఈ స‌ద‌స్సులో పాల్గొన్న‌వారు త‌మ ప‌నికి ఉండే భవిష్యత్తు, ఉద్యోగుల నిమగ్నత, హెచ్ఆర్ పద్ధతులపై సాంకేతికత ప్రభావం గురించి మంచి అవగాహన పొందుతారు.

Follow Us:
Download App:
  • android
  • ios