Asianet News TeluguAsianet News Telugu

2023 కొత్త రూల్స్: రేపటి నుండి ఈ రూల్స్ మారనున్నాయి.. అవేంటో తెలుసా..?

. కొన్ని ముఖ్యమైన రూల్స్ 1 జనవరి 2023 నుండి మారబోతున్నాయి. వీటిలో క్రెడిట్ కార్డ్‌లు, బ్యాంక్ లాకర్లు, జి‌ఎస్‌టి ఇ-ఇన్‌వాయిసింగ్, CNG-PNG ధరలు, వాహన ధరలకు సంబంధించిన మార్పులు ఉన్నాయి. 

2023 New Rules: New rules of credit card, bank locker and GST will be applicable know  will change in new year?
Author
First Published Dec 31, 2022, 11:48 AM IST

 మరి కొద్ది గంటల్లో 2022 సంవత్సరం ముగుస్తుంది. అలాగే కొత్త ఏడాది అంటే 2023  జనవరి నెల మొదలవుతుంది. ప్రతి నెల 1వ తేదీ కొన్ని కొత్త మార్పులను తెస్తుంది, ఇవి సామాన్యులకు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఈ మార్పులు నేరుగా  వారి ఆదాయంపై ప్రభావితం చేస్తాయి. కొన్ని ముఖ్యమైన రూల్స్ 1 జనవరి 2023 నుండి మారబోతున్నాయి. వీటిలో క్రెడిట్ కార్డ్‌లు, బ్యాంక్ లాకర్లు, జి‌ఎస్‌టి ఇ-ఇన్‌వాయిసింగ్, CNG-PNG ధరలు, వాహన ధరలకు సంబంధించిన మార్పులు ఉన్నాయి. 

కొత్త సంవత్సరం 2023 నుండి మారనున్న రూల్స్ గురించి తెలుసుకుందాం...

1. బ్యాంకు లాకర్‌
బ్యాంక్ లాకర్‌కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త సూచనలను జారీ చేసింది. ఈ నిబంధనలు 1 జనవరి 2023 నుండి అమల్లోకి వస్తాయి. ఈ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత లాకర్ల విషయంలో బ్యాంకులు ఖాతాదారులతో ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి వీల్లేదు. ఈ నిబంధనలను అమలు చేసిన తర్వాత బ్యాంకు లాకర్‌లో ఉంచిన వస్తువులకు ఏదైనా నష్టం జరిగితే, దానికి బ్యాంకు బాధ్యతగా నిర్ణయించబడుతుంది. బ్యాంక్ అండ్ కస్టమర్ మధ్య ఒప్పందం సంతకం చేయబడుతుంది. బ్యాంకులు లాకర్ సంబంధిత నిబంధనల మార్పు గురించిన మొత్తం సమాచారాన్ని కస్టమర్లకు MMS అండ్ ఇతర మార్గాల ద్వారా అందించాలి.

2. క్రెడిట్ కార్డ్
1 జనవరి  2023 నుండి క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే రూల్స్ లో మార్పు ఉంటుంది. ఈ మార్పు క్రెడిట్ కార్డ్‌ల ద్వారా పేమెంట్లపై సంపాదించిన రివార్డ్ పాయింట్‌లకు సంబంధించినది. కొత్త సంవత్సరం ప్రారంభం నుండి HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై అందుకున్న రివార్డ్ పాయింట్లను మార్చబోతోంది.  1 జనవరి 2023 నుండి కొత్త నిబంధనల ప్రకారం రివార్డ్ పాయింట్ సౌకర్యాలు అందించబడతాయి.

3. పెట్రోల్-డీజిల్ అండ్ ఎల్‌పి‌జి ధరలు
ప్రతిరోజు పెట్రోలియం కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. గత కొంతకాలంగా ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.  అయితే  జనవరి 1వ తేదీ ఉదయం ఇంధన ధరల్లో మార్పులు జరుగుతాయా లేదా అన్నది తేలనుంది. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంటింటి అండ్ వాణిజ్య ఎల్‌పి‌జి సిలిండర్ల ధరలలో కూడా మార్పును ప్రకటించవచ్చు.

4. సి‌ఎన్‌జి-పి‌ఎన్‌జి ధరలు
పెట్రోలు, డీజిల్ ధరల్లో మార్పుతో పాటు వాహనాల్లో ఉపయోగించే సీఎన్‌జీ, పీఎన్‌జీ గ్యాస్ ధరల్లో కూడా మార్పు రావచ్చు. ఇటీవలి కాలంలో దేశ రాజధాని అండ్ ఇతర నగరాల్లో సిఎన్‌జి అలాగే పిఎన్‌జి ధరలలో పెరుగుదల చోటుచేసుకుంది.  జనవరి 1వ తేదీన  గ్యాస్ కంపెనీలు ధరలను మరోసారి సవరించవచ్చు.  

5. వాహనాల ధరలు 
కొత్త సంవత్సరం 2023లో కొత్త వాహనాల ధరలు పెరగనున్నాయి. ఎం‌జి మోటార్, మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్, హోండా, టాటా మోటార్స్, రెనాల్ట్, ఆడి అండ్ మెర్సిడెస్ బెంజ్ సహా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. దేశంలోని ప్రముఖ కంపెనీ టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల ధరలను 2 జనవరి 2023 నుంచి పెంచనున్నట్టు తెలిపింది. హోండా కూడా వాహనాల ధరలను రూ.30,000 వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. మీరు కొత్త సంవత్సరంలో కొత్త వాహనాన్ని  కొనాలని చూస్తున్నట్లయితే మీకు ప్రస్తుతం ఉన్న ధర కంటే ఎక్కువగా ఉండొచ్చు.

6. జి‌ఎస్‌టి ఇ-ఇన్‌వాయిస్‌
కొత్త సంవత్సరంలో GST ఇ-ఇన్‌వాయిసింగ్ అండ్ ఎలక్ట్రానిక్ బిల్లుకు సంబంధించిన నియమాలలో కూడా ముఖ్యమైన మార్పులు ఉంటాయి. జిఎస్‌టి ఇ-ఇన్‌వాయిస్‌కు సంబంధించిన థ్రెషోల్డ్ పరిమితిని ప్రభుత్వం రూ.20 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గించింది. GST నియమాలలో ఈ మార్పులు 1 జనవరి  2023 నుండి వర్తిస్తాయి. ఐదు కోట్ల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారులు ఎలక్ట్రానిక్ బిల్లులను రూపొందించడం ఇప్పుడు అవసరం.

7. ఆధార్‌తో లింక్ 
వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి ఆధార్‌తో లింక్ చేయని పాన్‌లు (పర్మనెంట్ అక్కౌంట్ నంబర్) డీయాక్టివేట్ చేయబడతాయని ఆదాయపు పన్ను శాఖ  సలహా ఇచ్చింది. అయితే ఈ మార్పు జనవరిలో కాకుండా ఏప్రిల్ మొదటి తేదీ నుంచి వర్తింపజేయడం కాస్త ఊరట కలిగించే విషయమే. ఆదాయపు పన్ను శాఖ పబ్లిక్ కన్సల్టేషన్‌లో, “పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి, ఇది అవసరం. ఆలస్యం చేయవద్దు, ఈ రోజే లింక్ చేయండి! ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం, మినహాయించబడిన వర్గంలోకి రాని పాన్ హోల్డర్లందరూ మార్చి 31, 2023లోపు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. 

Follow Us:
Download App:
  • android
  • ios