Asianet News TeluguAsianet News Telugu

Bank Holidays In July: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. జూలైలో బ్యాంక్‌ సెలవులు ఇవే..!

రాబోయే జూలై నెలలో బ్యాంకు వ్యవహారాలను పూర్తి చేయాలనుకుంటున్నారా? అయితే జూలై నెలలో బ్యాంకులు మూతపడనున్న రోజులేవో ఇప్పుడు తెలుసుకుందాం. వీటి గురించి అవగాహన తెలుసుకుంటే సెలవు రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా ఉండొచ్చు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం జూలై 2022 నెలలో బ్యాంకుల సెలవులు ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం. 
 

17 Bank holidays in July.. check complete list here
Author
Hyderabad, First Published Jun 27, 2022, 12:16 PM IST

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జూలై -2022 సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం జూలై నెలలో మొత్తం 17 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే ఇవి మొత్తం దేశంలో ఒకే రోజు సెలవులు కావు. వివిధ రాష్ట్రాల్లో నిర్వహించుకునే పండుగల ప్రకారం ఈ సెలవుల జాబితాను ఆర్‌బీఐ జారీ చేస్తుంది.

నెలలో రెండు శనివారాలు, ఆదివారాల్లో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. ఈనెలలో మొత్తం ఐదు ఆదివారాలు వచ్చాయి. రెండు శనివారాలతో కలిపితే సాధారణ సెలవులు ఏడు ఉన్నాయి. బక్రీద్ తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో పండుగల కారణంగా బ్యాంకులకు సెలవులు వచ్చాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో శని, ఆదివారాలు మినహా బ్యాంకులు కిటకిటలాడుతుంటాయి. పలువురు బ్యాంకులు మూసిఉన్న తేదీలు తెలియక‌ బ్యాంకుల వద్దకు వచ్చి వెనుదిరిగి పోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో బ్యాంకులకు జూలై నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఉన్నాయనే వివరాలు తెలుసుకుంటే మందుగానే బ్యాంకు పనులకు ప్లాన్ చేసుకోవచ్చు.

సాధారణంగా బ్యాంకు సెలవులను మూడు కేటగిరీలుగా విభజిస్తుంటుంది రిజర్వు బ్యాంక్. స్టేట్-స్పెసిఫిక్ హాలిడే, రిలీజియస్ హాలిడే, ఇతర పండగలు. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఈ మతపరమైన సెలవులు వస్తుంటాయి. దీనికి ప్రత్యేకంగా తేదీ అనేది ఉండదు. ఇలాంటివన్నీ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద మంజూరు అవుతాయి. రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన జాబితా ప్రకారం జూలై నెల‌లో సెల‌వులు ఇవే.

జూలై 2022లో బ్యాంకు సెలవుల జాబితా

- శుక్రవారం, జూలై 1- రథ యాత్ర (ఒడిశా)

- ఆదివారం, జూలై 3 - అన్ని బ్యాంకులకు కామన్ హాలీడే

- మంగళవారం, జూలై 5- గురు హరగోవింద్ జయంతి (జమ్మూ & కాశ్మీర్)

- బుధవారం, జూలై 6- MHIP డే (మిజోరం)

- గురువారం, జూలై 7- ఖర్చీ పూజ (త్రిపుర)

- శనివారం, జూలై 9- ఈద్-ఉల్-అద్హా (బక్రీద్)/ రెండవ శనివారం

- ఆదివారం, జూలై 10- అన్ని బ్యాంకులకు కామన్ హాలీడే

- సోమవారం, జూలై 11- ఈద్-ఉల్-అజా

- బుధవారం, జూలై 13- అమరవీరుల దినోత్సవం (జమ్మూ కాశ్మీర్)

- బుధవారం, జూలై 13- భాను జయంతి (సిక్కిం)

- గురువారం, జూలై 14- బెన్ డియెంక్లామ్ (మేఘాలయ)

- శనివారం, జూలై 16- హరేలా (ఉత్తరాఖండ్)

- ఆదివారం, జూలై 17- అన్ని బ్యాంకులకు కామన్ హాలీడే

- శనివారం, జూలై 23- నాల్గవ శనివారం

- ఆదివారం, జూలై 24 - అన్ని బ్యాంకులకు కామన్ హాలీడే

- మంగళవారం, జూలై 26- కేర్ పూజ (త్రిపుర)

- ఆదివారం, జూలై 31 - అన్ని బ్యాంకులకు కామన్ హాలీడే
 

Follow Us:
Download App:
  • android
  • ios