ఫ్రూట్ జ్యుస్ బాటిల్స్ పై ఇక అది కనిపించదు.. FSSAI కొత్త రూల్స్..
FSSAI కొత్త నిబంధనను అమలు చేసింది. దీంతో కొన్ని జ్యూస్ కంపెనీలు దెబ్బతిననున్నాయి. 100 శాతం ఫ్రూట్ జ్యూస్, షుగర్ కంటెంట్ రూల్ అన్నింటికి వర్తిస్తాయి.
ఆరోగ్యానికి జ్యూస్ చాల మంచిది. ప్రతిరోజూ జ్యూస్ తాగాలని డాక్టర్స్ సూచిస్తుంటారు. ఫ్రెష్ జ్యుస్ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఇంట్లో జ్యూస్ తయారు చేయడం కష్టం. ఒత్తిడితో కూడిన లైఫ్ స్టయిల్లో వంట చేయడమే కొందరికి కష్టం, జ్యూస్ చేయడానికి టైం ఉండదని భావించే వారు రెడీమేడ్ జ్యూస్ తెచ్చి ఇంట్లో ఉంచుకుంటారు. మార్కెట్‌లో మీకు చాలా పండ్ల రసాలు దొరుకుతాయి. జ్యూస్ కవర్‌పై 100% న్యాచురల్, తక్కువ చక్కెర కంటెంట్ అని రాసి ఉంటుంది. దీన్ని నమ్మే వారు ఈ ప్రాసెస్ చేసిన జ్యూస్‌ని ఇంటి ఫ్రిజ్‌లో పెట్టుకుంటున్నారు. కానీ ఈ జ్యుస్లలో 100% పండ్ల రసం ఉండదు. ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్న కంపెనీల కోసం FSSAI రెండు కొత్త నిబంధనలను అమలు చేసింది. అయితే జ్యూస్ తయారీ కంపెనీలన్నీ దీన్ని కచ్చితంగా పాటించాలి.
FSSAI చేసిన కొత్త నిబంధనలు:
• 100 శాతం పండ్ల రసం లేదు: ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ అథారిటీ ఆఫ్ ఇండియా అన్ని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్‌లను ప్యాక్‌పై 100 శాతం పండ్ల జ్యుస్ అని రాయకూడదని ఆదేశించింది. వారి ఉత్పత్తులపై 100% ప్యూర్ జ్యుస్ అనే దాని తీసివేయాలని సూచించారు. ప్రజల డబ్బుని 100 శాతం పండ్ల జ్యుస్ అని చెప్పి ద్దోచుకుంటున్న కంపెనీలపై FSSAI మండిపడింది. ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ రూల్స్, 2018 ప్రకారం 100 శాతం క్లెయిమ్ చేసే అవకాశం లేదని స్పష్టం చేసింది. కొత్త ఆదేశం ప్రకారం, ప్రస్తుతం ఉన్న అన్ని ప్రీ-ప్రింటెడ్ ప్యాకేజింగ్ మెటీరియల్‌లను సెప్టెంబర్ 1, 2024లోపు దశలవారీగా తొలగించాలని నిర్దేశించ్చింది.
• FSSAI ప్రకారం, కిలో జ్యుస్ లో 15 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర కంటెంట్ స్వీట్ జ్యూస్ అని లేబుల్ చేయాలి.
అంతకుముందు, ఏప్రిల్‌లో, FSSAI FBOలను ఆరోగ్య పానీయాలు అండ్ శక్తి పానీయాలుగా విక్రయిస్తున్న ఆహారాలను తిరిగి వర్గీకరించాలని కోరింది.
ప్రాసెస్డ్ జ్యూస్ ప్రతికూలతలు(Disadvantages): ప్యాక్డ్ జ్యూస్ ఆరోగ్యానికి మంచిది కాదు. మొత్తం పండ్ల రసం అని చెప్పినప్పటికీ, ఇందులో మొత్తం పండ్ల రసం ఉండదు. దానిలో నీరు కలుపుతారు. ఈ రసాన్ని పారిశ్రామిక ప్రాంతంలో తయారు చేస్తారు. షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. నీరు, పంచదార, పండ్ల రసాలను ఎక్కువ కాలం భద్రంగా ఉంచే ప్రక్రియలో రసం రుచి పెరుగుతుంది కానీ అది ఆరోగ్యకరం కాదు. దాని నుండి విడుదలయ్యే రసాయనం క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన అలాగే దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది. బరువు పెరగడం, గుండె జబ్బులు వంటి వివిధ వ్యాధుల బారిన పడవచ్చు.