Asianet News TeluguAsianet News Telugu

Budget 2022: ఏప్రిల్​ 1 నుంచి ధ‌ర‌లు పెరిగే.. తగ్గే వస్తువుల లిస్ట్‌ ఇదే..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఫిబ్రవరి 1న‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ సందర్భంగా పలు కీలక ప్రకటనలు చోటు చేసుకున్నాయి. ఎంతో ఆశగా ఎదురుచూసిన పన్ను మినహాయింపుపై ఎలాంటి ప్రకటన రాలేదు. వ్యక్తిగత ఆదాయ పన్ను టారిఫ్ పైన ఊరట లభించలేదు.

what gets cheaper
Author
Hyderabad, First Published Feb 2, 2022, 10:03 AM IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఫిబ్రవరి 1న‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ సందర్భంగా పలు కీలక ప్రకటనలు చోటు చేసుకున్నాయి. ఎంతో ఆశగా ఎదురుచూసిన పన్ను మినహాయింపుపై ఎలాంటి ప్రకటన రాలేదు. వ్యక్తిగత ఆదాయ పన్ను టారిఫ్ పైన ఊరట లభించలేదు. అయితే ఐటీ రిటర్న్స్ సవరణలకు రెండేళ్ల సమయం ఇచ్చారు. ఆదాయ పన్ను స్లాబ్‌లో మార్పు లేకపోవడంతో మధ్యతరగతి జీవులపై ప్రభావం ఉంటుంది. ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటే ప్రజల చేతిలో నిధులను పెంచుతుంది. కానీ ఊరట లభించలేదు. నేషనల్ పెన్షన్ స్కీంకు సంబంధించి ఉద్యోగులకు 14 శాతం వరకు మినహాయింపును ఇచ్చారు. ప్రస్తుత బడ్జెట్ అనంతరం పలు ఉత్పత్తుల ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇవి సామాన్యులపై ప్రభావం చూపుతాయి.

కస్టమ్స్ డ్యూటీ పెంపు 
గత బడ్జెట్‌లో వలె ధరల్లో భారీ మార్పులు ఉండకపోవచ్చు. అయితే కొన్ని ఉత్పత్తులపై ప్రభావం ఉంటుంది. కస్టమ్స్ డ్యూటీలో కొన్ని మార్పులు చేశారు. FY23లో కొన్ని ఉత్పత్తులపై ప్రభావం చూపుతుంది. కొన్ని రసాయన దిగుమతులపై దిగుమతి సుంకాన్ని తగ్గించారు. కట్ చేసి పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలపై కస్టమ్స్ సుంకాన్ని 5 శాతానికి తగ్గించారు. గొడుగులపై కస్టమ్స్ డ్యూటీని 20 శాతం పెంచారు.

ధరలు తగ్గేవి ఇవే..!

పాలీష్​ చేయని డైమండ్స్​పై కస్టమ్స్ సుంకాన్ని 7.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్లు బడ్జెట్​ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీనితో వచ్చే ఆర్థిక సంవత్సరంలో డైమండ్స్ ధరలు కాస్త దిగిరానున్నాయి. దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు ప్రకటించిన నిర్ఱమయాల వల్ల ఎలక్ట్రానిక్స్ ధరలు కూడా తగ్గే అవకాశముంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు, ఛార్జర్‌లు వంటి వాటి ధరలు దిగిరానున్నాయి. స్టీల్​ ల్ తుక్కుపై మరో ఏడాది రాయితీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. దీనితో స్టీల్​ ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశముందని అంచనాలు వస్తున్నాయి. ఇక బట్టలు, పెట్రోలియం ఉత్పత్తులు, మిథనాల్ వంటి రసాయనాల ధరలు కూడా తగ్గే అవకాశముంది.


ధ‌ర‌లు పెరిగేవి ఇవే..!
అన్ని దిగుమతి వస్తువులు, గొడుగులపై భారీ సుంకాలను పెంచడంతో వీటి ధరలు భారీగా పెరగనున్నాయి. క్రిప్టో లావాదేవీలపై 30 శాతం పన్నులు,  అనుకరణ ఆభరణాలు, స్పీకర్స్‌, హెడ్‌ ఫోన్స్‌, ఇయర్‌ఫోన్స్ వంటి సోలార్‌ సెల్స్‌, మాడ్యూల్స్‌, ఎక్స్‌ రే మెషిన్స్ వంటి వాటిపై ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios