Asianet News TeluguAsianet News Telugu

Budget 2022: కేంద్ర బడ్జెట్ 2022 కోసం ప్రత్యేక యాప్​.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..?

వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ పూర్తిగా పేపర్​ లెస్​గా ఉండనుంది. దీనితో బడ్జెట్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా సరికొత్త మొబైల్​ యాప్​ను (Union Budget mobile APP) కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ యాప్​ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
 

Union Budget mobile app
Author
Hyderabad, First Published Jan 29, 2022, 11:59 AM IST

వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ పూర్తిగా పేపర్​ లెస్​గా ఉండనుంది. దీనితో బడ్జెట్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా సరికొత్త మొబైల్​ యాప్​ను (Union Budget mobile APP) కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ యాప్​ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి స్థాయిలో పేపర్​లెస్ బడ్జెట్​

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ఫిబ్రవరి 1న పార్లమెంట్​లో బడ్జెట్ (Budget 2022-23 date) ప్రవేశపెట్టనున్నారు. పూర్తి స్థాయిలో పేపర్​లెస్​గా బడ్జెట్ ప్రవేశపెడుతుండటం ఇది రెండో సారి. గత ఏడాది కూడా సాఫ్ట్​ కాపీ రూపంలోనే బడ్జెట్​ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి. కరోనా సంక్షోభం ఇందుకు (Corona impact on Budget) కారణం. ఈ నేపథ్యంలో పార్లమెంట్​ సభ్యులు (ఎంపీలు), సాధారణ పౌరులు బడ్జెట్​ వివరాలను సులంభంగా చదివేందుకు వీలుగా కేంద్రం 'యూనియన్​ బడ్జెట్​ మొబైల్​ యాప్​'ను (Union Budget App) ప్రారంభించింది.

ఎక్కడ డౌన్​లోడ్​ చేసుకోవాలి..?

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ పార్లమెంట్​లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత.. ఈ మొబైల్​ యాప్​లో బడ్జెట్​కు సంబంధించిన వివరాలన్నింటిని తెలుసుకోవచ్చు. ఇప్పటికే ప్లే స్టోర్​, యాప్​ స్టోర్లలో ఈ యాప్ డౌన్​లోడ్​లకు అందుబాటులో ఉంది. ఈ మొబైల్​ యాప్​ ఇంగ్లీష్​, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. బడ్జెట్​ సందర్భంగా ఈ యాప్​ను ఎక్కువ మంది వినియోగించే వీలుంది. ఇదే అదనుగా క్లోన్​ యాప్​లు పుట్టుకొచ్చే ప్రమాదముంది. కాబట్టి ఈ మొబైల్​ యాప్​ను డౌన్​లోడ్​ చేసుకునే ముందు.. యాప్ పబ్లీషర్​ నేషనల్​ ఇన్ఫర్మేటిక్ సెంటర్​ (ఎన్​ఐఎఫ్​) పేరును చూడాలని ప్రభుత్వం సూచించింది.

ప్లే స్టోర్​, యాప్​ స్టోర్​తో పాటు.. యూనియన్​ బడ్జెట్ వెబ్​ పోర్టల్​ నుంచి కూడా ఈ యాప్​ను డౌన్​లోడ్ చేసుకునే వీలుందని ఆర్థిక శాఖ వెల్లడించింది. వెబ్​ పోర్టల్​, యాప్​ ద్వారా బడ్జెట్​ డాక్యుమెంట్​లను చదవడం, డౌన్​లోడ్​ చేసుకోవడం కూడా చేయొచ్చని వివరించింది.

ఈ యాప్​లో ఏఏ వివరాలు ఉంటాయి..?

ఈ యాప్​లో బడ్జెట్​ స్పీచ్​, యూన్యువల్​ ఫినాన్షియల్ స్టేట్​మెంట్​ ( బడ్జెట్​), డిమాండ్​ ఫర్ గ్రాంట్స్​ (డీజీ), ఫినాన్స్ బిల్​ సహా మొత్తం 14 రకాల డాక్యుమెంట్లు అందుబాటులో ఉంటాయి. అన్ని డాక్యుమెంట్లు పీడీఎఫ్​ రూపంలో డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. సెర్చ్ ఆప్షన్ కూడా (Budget APP features) ఉంటుంది.

హల్వా వేడుకలోనూ మార్పులు

బడ్జెట్​ సంప్రదాయంలో మరో కీలక మార్పు చేసింది ప్రభుత్వం. బడ్జెట్ పత్రాల ముద్రనకు ముందు నిర్వహించే హల్వా వేడుక (Halwa ceremony) బదులు.. మిఠాయి పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బడ్జెట్ ప్రతుల ముద్రననకు ముందు (బడ్జెట్ రూపకల్పన చివరి దశ) ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ వేడుక తర్వాత.. బడ్జెట్​ ప్రతుల ముద్రనలో పాల్గొనే ఎవరు కూడా.. ప్రెస్​ నుంచి బయటకు వెళ్లేందుకు వీలుందడు. ఫోన్ కూడా వాడకూడదు. ఉన్నత స్థాయి అధికారుల్లో కొద్ది మందికి మాత్రమే ఫోన్ వాడే వెసులుబాటు ఉంటుంది.

ఈ సారి బడ్జెట్ సమావేశాలు ఇలా..!


ఈ సారి బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం అవుతాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడతారు ఆర్థిక మంత్రి. బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో ఏప్రిల్​ 8 వరకు కొనసాగనున్నాయి. అయితే కరోనా భయాల నడుమ.. పార్లమెంట్ ఉభయ సభలు బడ్జెట్​  రోజున మినహా మిగతా రోజుల్లో షిఫ్టుల వారీగా (Budget sessions 2022) జరగనున్నాయ.

Follow Us:
Download App:
  • android
  • ios