Union Budget 2023: కేంద్ర బడ్జెట్‌తో ఎవరికి లాభాలు.. ఎవరికి లాస్?

కేంద్ర బడ్జెట్ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలని, ఉపాధి కల్పన పెంచాలని నిర్ణయించింది. వ్యవసాయం, డిఫెన్స్, రైల్వేలకూ భారీ మొత్తంలో కేటాయింపులు జరిపింది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌తో ఎవరు ఎక్కువ లాభపడనున్నారు? ఎవరు ఎక్కువగా నష్టపోనున్నారు? అనే విషయాలను పరిశీలిద్దాం.
 

union budget 2023, who gains and who lost

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉద్యోగాల కల్పనకు, పెట్టుబడులను ఆకర్షించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు ప్రకటించింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగాన్ని ఎదుర్కొనేలా ఈ బడ్జెట్ ఉన్నది. అలాగే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైతులు, వెనుకబడిన వర్గాలు, మహిళలపై ఫోకస్ పెట్టారు. కరోనా కారణంగా ఏర్పడిన తారతమ్యాలను తగ్గించే చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. 

మూలధన వ్యయం కోసం కేంద్ర బడ్జెట్‌లో 10 లక్షల కోట్ల రూపాయాలను ప్రకటించింది. ఇది దేశవ్యాప్తంగా రోడ్లు, పోర్టులు, ఎయి ర్‌పోర్టుల విస్తరణకు ఉపకరించనుంది. పెట్టుబడులకూ ఆకర్షిణీయ గమ్యస్థానంగా మార్చనున్నాయి. ఈ కోణంలోనే కేంద్ర బడ్జెట్‌తో స్థూలంగా ఎవరు లాభ పడనున్నారు? ఎవరికి ప్రతికూలంగా ఈ బడ్జెట్ ఉన్నదనే విషయాలను పరిశీలిద్దాం.

విన్నర్స్:
 

వ్యవసాయం:
సాగు రంగంలో కేంద్ర ప్రభుత్వం వ్యయాలను పెంచింది. మొత్తం జీడీపీలో 19 శాతం సాగుకు కేటాయించింది. హార్టికల్చర్ కోసం, అగ్రికల్చర్ యాక్సిలేటర్ ఫండ్ కింద వ్యవసాయ స్టార్టప్‌లకు ఫైనాన్స్ ఇవ్వడానికి రూ. 22 బిలియన్ రూపాయలను కేటాయించింది. ఈ నిర్ణయం కావేరీ సీడ్ కో, ధనుకా అగ్రిటెక్, బాంబే సూపర్ హైబ్రీడ్ సీడ్స్, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్‌ వంటి సంస్థలు లబ్ది పొందనున్నాయి.

టూరిజం:
పెరిగిన ట్రావెల్ డిమాండ్‌‌ను అందిపుచ్చుకోవడానికి 50 గమ్యస్థానాలను గుర్తించి దేశీయ పర్యాటకాన్ని పెంచడానికి నిర్ణయాలు తీసుకుంది. ఫుడ్ స్ట్రీట్స్, సెక్యూరిటీ, ఫిజికల్, వర్చువల్ కనెక్టివిటీల వివరాలను అందించే యాప్ గైడ్‌ను కూడా అభివృద్ధి చేయనుంది. తద్వారా ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్ప్, థామస్ కుక్, ఇండియన్ హోటల్స్, ఈఐహెచ్ లిమిటెడ్‌లు ప్రధానంగా లాభ పడే అవకాశాలు ఉన్నాయి. 

ఇన్‌ఫ్రా:
మారుమూల ప్రాంతాలకూ రవాణాను విస్తరించే మౌలిక సదుపాయాలపై ఫోకస్ పెట్టింది. అందుకే అదనంగా 50 ఎయిర్‌పోర్టులు, హెలిపోర్టులు, ఏరోడ్రోమ్స్, అలాగే, కొత్తగా 100 ప్రాజెక్టులను చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. దీని ద్వారా అదానీ ఎయిర్‌పోర్టు హోల్డింగ్స్, జీఎంఆర్ ఎయిర్‌పోర్టులు ఇన్‌ఫ్రా, జీవీకే ఎయిర్‌పోర్టు డెవలపర్స్‌లతోపాటు ఎల్ అండ్ టీ, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు లబ్ది పొందనున్నాయి.

ట్యాక్స్‌పేయర్స్:
అందరూ ఊహించినట్టే మోడీ ప్రభుత్వం ట్యాక్స్‌పేయర్లకు ఉపశమనం ఇచ్చింది. న్యూ ఇన్‌కమ్ ట్యాక్స్ రెజైమ్‌లో రూ. 7 లక్షల వరకు ఇండివిడ్యువల్స్ పై పన్ను ఉండదని ప్రకటించింది. అలాగే, ట్యాక్స్ శ్లాబులనూ తగ్గించింది. అత్యధిక ట్యాక్స్ రేట్‌ను 39 శాతానికి తగ్గించింది. ఇది మిడిల్ క్లాస్‌కు లబ్ది చేకూర్చడమే కాక వినిమయ డిమాండ్ కూడా పెంచుతుంది.

ఇనుము, సిమెంట్:
హౌజింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రైల్వేలకు మంచి కేటాయింపులు ప్రకటించడంతో స్టీల్ మిల్స్, సిమెంట్ తయారీదారులకు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. తద్వారా టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్‌ల వంటి కంపెనీలకు లబ్ది చేకూరుతుంది.

ఎలక్ట్రిక్ వెహికిల్స్:
ఎలక్ట్రిక్ వెహికిల్స్‌లో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీల దిగుమతులపై కస్టమ్ డ్యూటీ తగ్గించి ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీకి ప్రోత్సహించినట్టయింది.ఇవి ఎక్సైడ్ ఇండస్ట్రీస్, అమర రాజా బ్యాటరీస్, టాటా మోటార్స్ వంటి ఆటోమేకర్స్, మహీంద్ర అండ్ మహీంద్ర వంటి సంస్థలకు లబ్ది చేకూర్చనుంది.

గ్రీన్ ఎనర్జీ:

కార్బన్ న్యూట్రాలిటీ కోసం ఎనర్జీ ట్రాన్సిషన్‌లో 350 బిలియన్ రూపాయలను పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయాలు ఉన్నాయి. అందుకే 4,000 మెగావాట్ అవర్‌ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్ కోసం ప్రభుత్వం ఆర్థిక సహకారం ఇవ్వనుంది. ఈ రంగంలోని సంస్థలకు ప్రతికూల నిర్ణయాలు జరిగాయి.

వీరికి ప్రతికూలం:

సిగరెట్ తయారీదారులు:
సిగరెట్లపై ట్యాక్స్ పెంచగానే ఐటీసీ,గాడ్‌ఫ్రరె ఫిలిప్స్ ఇండియా షేర్లు పడిపోయాయి. ప్రత్యేకించి కొన్ని సిగరెట్లపై పన్నును 16 శాతం పెంచింది. ఇది ఫిబ్రవరి 2వ తేదీ నుంచే అమల్లోకి వస్తుంది.

ఆభరణాలు:
బంగారంపై దిగుమతి సుంకాలను తగ్గించాలనే డిమాండ్‌ల నేపథ్యంలో ప్రభుత్వం వాటిని యథాతథంగా ఉంచడంతో ఆభరణాల స్టాక్స్ పడిపోయాయి. అంతేకాదు, వెండిపై దిగుమతి సుంకాలను పెంచింది. దీంతో కల్యాణ్ జువెల్లర్స్, టైటాన్ కో, పీసీ జువెల్లర్ లిమిటెడ్‌ వంటి కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉన్నది.

ఆయిల్ రిఫైనరీలు:
ప్రభుత్వ పరిధిలోని ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం వంటి ఆయిల్ రిఫైనరీల డిమాండ్‌లను ప్రభుత్వం పట్టించుకోలేదు. వాటి నష్టాలపై ఎలాంటి పరిహారాలను ప్రకటించలేదు. 

ఫారీన్ కార్ మేకర్లు:
ఎలక్ట్రిక్ వెహికిల్స్ సహా దిగుమతి చేసుకునే ఆటో మొబైల్స్ అన్నింటిపై ఎక్కువ పన్నులు పడనున్నాయి. 40 వేల డాలర్లకు ఎక్కువ ధర గల కార్లు, ఎలక్ట్రిక్ కార్ల దిగుమతిపై పన్నులను 60 శాతం నుంచి 70 శాతం వరకు పెంచింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios