Asianet News TeluguAsianet News Telugu

Union Budget 2022: కేంద్ర ఆర్థిక‌ మంత్రి నిర్మలా సీతారామన్ బ‌డ్జెట్‌ టీమ్​ ఇదే..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్​లో బడ్జెట్‌ సమర్పించనున్నారు. ఆమె కేంద్ర బడ్జెట్​ను ప్రవేశపెట్టడం ఇది నాల్గొవ‌సారి. కరోనా సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించే పనిలో ఉన్నారామె.

Union Budget 2022
Author
Hyderabad, First Published Jan 28, 2022, 2:13 PM IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్​లో బడ్జెట్‌ సమర్పించనున్నారు. ఆమె కేంద్ర బడ్జెట్​ను ప్రవేశపెట్టడం ఇది నాల్గొవ‌సారి. కరోనా సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించే పనిలో ఉన్నారామె. ఇప్పటికే భారత్ కరోనాతో పోరాడుతున్నందున.. ప్రజారోగ్య రంగానికి పెద్దఎత్తను నిధులు కేటాయింపులు ఉంటాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 

మరి బడ్జెట్ రూపకల్పనలో(Budget making) శ్రమిస్తున్న ఆర్థిక మంత్రి సహా.. ఆమె బృందం గురించి తెలుసుకుందాం. ఈ బడ్జెట్ రూపకల్పనలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో (Nirmala Seetarman Team) పాటు.. టీవీ సోమనాథమ్, తరుణ్ బజాజ్, దేబాశిష్ పాండా, అజయ్ సేథ్, తుహిన్ కాంత పాండేలతో కూడిన ఐదుగురు ఉన్నత అధికారుల బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. వివిధ రంగాలకు కేటాయింపులను నిర్ణయించడంలో వీరు కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది.

టీవీ సోమనాథన్: తమిళనాడు కేడర్‌కు చెందిన IAS(1987) అధికారి. 2015లో ప్రధాని కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. ఆర్థిక కార్యదర్శిగా నియమితులైన ఐదుగురిలో అత్యంత సీనియర్. ఆర్థిక మంత్రిత్వ శాఖను మరింత సమర్థంగా పనిచేయించడంలో ఆయనది కీలక పాత్ర అని చెప్పవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయ (Capital Expenditure) ఖర్చుల లెక్కలను చూడాల్సింది ఈయనే!

తరుణ్ బజాజ్: ఆర్థిక మంత్రిత్వ శాఖ రెవెన్యూ కార్యదర్శి (Revenue Secretary Finance). పన్ను లక్ష్యాల నిర్ధారణ, వసూళ్లను సాధణ అతని విధులు. మహమ్మారి సమయంలో వైద్యారోగ్య వ్యవస్థను సన్నద్ధం చేయడంలో బజాజ్ కీలక పాత్ర పోషించారు. మహమ్మారి కారణంగా కుదేలైన వ్యాపార రంగానికి ప్యాకేజీలను ప్రకటించాలని ప్రతిపాదిస్తున్నారు.

దేబాశిష్ పాండా: 1987 బ్యాచ్ IAS అధికారి. ఆర్థిక సేవల విభాగం అధిపతిగా ప్రభుత్వ రంగ కార్యాలయాల పునరుద్ధరణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మహమ్మారి విజృంభణలోనూ బ్యాంకులు(Indian Banking) బాగా పనిచేశాయంటే అది ఈయన చలవే!. బడ్జెట్​లోనూ బ్యాంకింగ్ రంగంలో సులభతర సేవలను అందించేందుకు తనదైన ప్రతిపాదనలు చేస్తున్నారు.

అజయ్ సేథ్: 2021ఏప్రిల్​లో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా చేరడానికి ముందు బెంగుళూరు మెట్రో మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. పార్లమెంట్​లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాలన్నింటినీ రూపొందించే బాధ్యత ఈయనదే. అంతేగాక.. క్యాపిటల్ మార్కెట్(Capital Market), ఇన్వెస్ట్‌మెంట్, మౌలిక వసతులపై పలు విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆదాయ మార్గాల పెంపు, ఉద్యోగాలను సృష్టి వంటి ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలని ప్రతిపాదిస్తున్నారు.

తుహిన్ కాంత పాండే: పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలను చేరుకోకపోయినప్పటికీ.. ఎయిర్ ఇండియా విక్రయంలో ప్రభుత్వం విజయం సాధించిందంటే అది తుహిన్ కాంతా పాండే వల్లే అనుకోవచ్చు. డిస్​ఇన్వెస్ట్​మెంట్​లో కీలక పాత్ర పోషించిన పాండే.. ఎల్​ఐసీ ఐపోఓ(LIC IPO) ప్రధాన లక్ష్యంగా 2022-బడ్జెట్​ను రూపొందిస్తున్నట్లు సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios