Asianet News TeluguAsianet News Telugu

కొత్త పన్ను సిస్టం ప్రకారం రూ. 7 లక్షల మీద ఒక్క రూపాయి ఎక్కువ సంపాదించినా ఎంత పన్ను చెల్లించాలో తెలుసా..?

కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి తెలిపారు. కానీ మీ వార్షిక ఆదాయం ఏడు లక్షల మీద ఒక్క రూపాయి దాటినా అంటే  రూ. 7,00,001 ఉన్నప్పటికీ  నిర్దేశించిన రేట్ల ప్రకారం పన్ను చెల్లించాలి.

Under the new tax system Rs. Do you know how much tax you have to pay even if you earn one rupee more than 7 lakh MKA
Author
First Published Feb 2, 2023, 6:59 PM IST

బడ్జెట్-2023 ఫిబ్రవరి 1న పార్లమెంటులో సమర్పించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టే ఈ బడ్జెట్ కోసం దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని ప్రభుత్వం రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచింది. అంటే ఏడు లక్షల వార్షికాదాయంపై పన్ను ఉండదు, అయితే మీ ఆదాయం ఈ పరిమితిని ఒక్క రూపాయి దాటినా మీకు కొత్త పన్ను విధానంతో మీరు సుమారు రూ. 25 వేల వరకూ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎలాగో తెలుసుకుందాం. 

ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని 5 లక్షల నుంచి 7 లక్షలకు పెంచారు. ఈ ప్రయోజనం కొత్త పన్ను విధానంలో మాత్రమే అందించారు. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ కూడా చేర్చారు. కానీ కనీసం రూ.15.50 లక్షల ఆదాయం రావాలి. ఇందులో సర్‌ఛార్జ్‌ను 37 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. 

ఒక వ్యక్తి వార్షిక ఆదాయం రూ.7 లక్షల వరకు ఉంటే, అప్పుడు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కొత్త పాలసీ ప్రకారం రూ.15 లక్షల వార్షికాదాయం ఉన్న వ్యక్తి గతంలో రూ.1.87 లక్షలు ఉండగా, రూ.1.5 లక్షలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ రకంగా కొంత డబ్బు ఆదా అవుతుంది. 

కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి తెలిపారు. కానీ మీ వార్షిక ఆదాయం ఏడు లక్షల మీద ఒక్క రూపాయి దాటినా అంటే  రూ. 7,00,001 ఉన్నప్పటికీ  నిర్దేశించిన రేట్ల ప్రకారం పన్ను చెల్లించాలి. 

ఒక సారి బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన కొత్త పన్ను స్లాబ్‌లు చూద్దాం..
0 నుండి 3 లక్షలు 0%
3 నుండి 6 లక్షలు 5%
6 నుండి 9 లక్షలు 10%
9 నుండి 12 లక్షలు 15%
12 నుండి 15 లక్షలు 20%
15 లక్షల పైన 30%

2023-24 బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన కొత్త పన్ను స్లాబ్‌ల ప్రకారం, వార్షిక ఆదాయం 0 నుండి 3 లక్షల వరకు 0%, 3 నుండి 6 లక్షల ఆదాయంపై 5%, 6 నుండి 9 లక్షల ఆదాయంపై 10%, రూ. 9 నుంచి 12 లక్షల ఆదాయంపై 15 శాతం, రూ. 12 నుంచి 15 లక్షల ఆదాయంపై 20 శాతం, రూ. 15 లక్షలకు పైబడిన ఆదాయంపై 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రకారం, ఏడు లక్షల రూపాయల ఆదాయం రెండు పన్ను శ్లాబుల క్రింద వస్తుంది.

సింపుల్ గా చెప్పాలంటే ఉదాహరణకు మీ ఆదాయం రూ. 7 లక్షలు అనుకుంటే అందులో రూ. 3 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదు. మిగితా  రూ.4 లక్షలపై పన్ను చెల్లించాలి, కొత్త స్లాబు ప్రకారం చూస్తే, ఆ రూ.4 లక్షల్లో రూ.3 లక్షలకు 5 శాతం పన్ను చెల్లించాలి, అంటే సుమారు రూ.15,000 వరకు ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన రూ 1 .లక్షకు 10% పన్ను చెల్లించాలి అంటే రూ. 10,000 చెల్లించాలి. అదే కొత్త స్లాబు ప్రకారం అదే మీ ఆదాయం రూ. 700001 అనుకుంటే దానిపై మొత్తం రూ. 25000 పన్ను చెల్లించాల్సి వస్తుంది.  

ఇదిలా ఉంటే సెక్షన్ 87A పరిమితి కింద రిబేటును 5 లక్షల నుంచి 7 లక్షలకు పెంచారు. ఇంతకుముందు, మీ ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువగా ఉన్నట్లయితే, రిబేట్  కారణంగా  ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, ప్రస్తుతం  పరిమితి 7 లక్షలకు పెంచారు, అంటే ఆర్థిక సంవత్సరంలో మీ ఆదాయం 7లక్షల వరకూ ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఏడు లక్షల మీద ఒక్క రూపాయి ఎక్కువ సంపాదించినా కొత్త టాక్స్ సిస్టం ప్రకారం రూ. 25 వేల వరకూ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios