Union Budget 2022: మరోసారి పేపర్‌లెస్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం నాడు మరోసారి పేపర్ లెస్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. వరుసగా రెండోసారి ఆమె పేపర్ లెస్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.

Paperless Budget Again,Nirmala Sitharaman Carries Tablet In Red Sleeve

న్యూఢిల్లీ:కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి Nirmala Sitharaman మంగళవారం నాడు పేపర్‌లెస్ ఫార్మాట్ లో బడ్జెట్ ను సమర్పించారు. ఇవాళ ఎరుపు రంగులో ఉన్న  టాబ్లెట్ లో బడ్జెట్ ను ఆమె చదివి విన్పించారు.కరోనా నేపథ్యంలో బడ్జెట్ కు ముందు నిర్వహించే Halwan వేడుకను ఈ దఫా నిర్వహించలేదు. 2019లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ పేపర్లను  Brief Case కేసులలో తీసుకెళ్లే వలసవాద పద్దతికి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్వస్థి పలికారు.

British ఆర్ధిక మంత్రులు ఇప్పటికీ బడ్జెట్ ప్రతులను బ్రీఫ్ కేసుల్లో తీసుకెళ్తారు.  ఇండియాలో కూడా ఆర్ధికమంత్రులు చాలా మంది బ్రీఫ్ కేసుల్లో బడ్జెట్ పత్రాలను తీసుకెళ్లే సంప్రదాయం కొనసాగించారు.

గత ఏడాదిలోనే Digital విధానంలోనే  బడ్జెట్ ను పార్లమెంట్ కు సమర్పించింది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ కాపీలను డౌన్ లోడ్  చేసుకోవడం గత ఏడాదే  యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. బడ్జెట్ కు చెందిన 14 డాక్యుమెంట్లు అందుబాటులో ఈ మొబైల్ యాప్ లో ఉంచారు. 1860లో బ్రిటిష్ బడ్జెట్ చీఫ్ విలియం ఈ గ్లాడ్ స్టోన్ బడ్జెట్ కోసం ఎర్రరంగు సూట్ కేసును ఉపయోగించాడు. 1947లో భారత దేశ తొలి ఆర్ధిక మంత్రి ఆర్ కె షణ్ముఖం చెట్టి తొలి బడ్జెట్ ను సమర్పించడానికి లెదర్ ఫోర్టుఫోలియోను ఉపయోగించాడు
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios