నేషనల్ హైవేస్ నెట్ వర్క్‌ 25 వేల కి.మీ పెంచుతాం: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మంగళశారం నాడు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్  యువత, రైతులు, మహిళలకు మేలు చేస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

Gati Shakti masterplan to make world-class infra, says Nirmala Sitharaman

న్యూఢిల్లీ: దేశంలో నేషనల్ హైవేస్ నెట్ వర్క్ ను 25 వేల కి.మీ కి పెంచుతామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.కేంద్ర మంత్రి Nirmala Sitharaman మంగళవారం నాడు Budget ను ప్రవేశ పెట్టారు.  నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం ఇది వరుసగా నాలుగో సారి. ఇవాళ Parliament ఆవరణలో సమావేశమైన కేంద్ర కేబినెట్ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. 

నేషనల్ హైవేస్ నెట్ వర్క్  కోసం రూ. 20 వేల కోట్లను సమీకరిస్తున్నామని కేంద్ర మంత్రి ప్రకటించారు. దేశంలో నాలుగు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్  తెలిపారు. పర్వత ప్రాంతాలన్ని కలిపేలా పీపీపీ మోడల్ లో పర్వత్ మాలా కార్యక్రమాన్ని చేపడుతామని కేంద్ర మంత్రి ప్రకటించారు.

రానున్న 25 ఏళ్ల పురోగతిని దృష్టిలో ఉంచుకొని ఈ బడ్జెట్ ను ప్రతిపాదించినట్టుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2021-22 బడ్జెట్ లో ప్రభుత్వ పెట్టుబడులు, మూలధన వ్యయం గణనీయంగా పెరిగిందన్నారు. ఈ బడ్జెట్  యువత, రైతులు, మహిళలకు మేలు చేస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందు కోసం ప్రధానమంత్రి గతిశక్తి మాస్టర్ ప్లాన్ ప్రక్రియకు మార్గనిర్ధేశం చేస్తోందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

 ఏడు అంశాలపై ఈ బడ్జెట్ లో ప్రధానంగా కేంద్రీకరించామని కేంద్ర మంత్రి ప్రకటించారు. నదుల అనుసంధానానికి  ఈ బడ్జెల్ లో ప్రోత్సాహం కల్పిస్తామని కూడా మంత్రి చెప్పారు.75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్  కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు.డిజిటల్ హెల్త్ సిస్టం కోసం జాతీయ విధానాన్ని తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ స్టడీకి బడ్జెట్ లో ప్రోత్సాహం కల్పిస్తామన్నారు.మానసిక ఆరోగ్య వయవస్థ కోసం జాతీయ విధానం తీసుకొస్తామన్నారు. నైపుణ్య అభివృద్దికి త్వరలో డిజిటల్ వ్యవస్థను రూపకల్పన చేశామన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios