Union Budget 2022... నదుల అనుసంధానం కోసం రూ.44,605 కోట్లు: నిర్మలా సీతారామన్
నదుల అనుసంధానం కోసం బడ్జెట్ లో రూ.44,605 కోట్లు కేటాయించినట్టుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.ఈ పథకం కింద డీపీఆర్ లు కూడా సిద్దం చేశామన్నారు.
న్యూఢిల్లీ:నదుల అనుసంధానానికి సంబంధించి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఐదు నదుల అనుసంధానానికి సంబంధించి ముసాయిదా డీపీఆర్ లు ఖరారయ్యాయని కేంద్ర మంత్రి తెలిపారు.కేంద్ర మంత్రి Nirmala Sitharaman మంగళవారం నాడు Budget ను ప్రవేశ పెట్టారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం ఇది వరుసగా నాలుగో సారి. ఇవాళ Parliament ఆవరణలో సమావేశమైన కేంద్ర కేబినెట్ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది.
డామన్ గంగా- పింజల్, పర్ తాపీ- నర్మద, గోదావరి- కృష్ణా, కృష్ణా- పెన్నా, పెన్నా- కావేరీ నదుల అనుసంధానికి సంబంధించి డీపీఆర్‌లు ఖరారయ్యాయని కేంద్ర మంత్రి బడ్జెట్ ప్రసంగంలో వివరించారు.కెన్ -బెత్వా నదుల అనుసంధానం కింద ఈ ఐదు నధుల అనుసంధానం కొసం DPRలు ఖరారు చేశామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. నదుల అనుసంధానం కోసం రూ.44,605 కోట్లను ఖర్చు చేయనున్నట్టుగా కేంద్ర మంత్రి తెలిపారు.
Rivers అనుసంధానం గురించి చాలా కాలంగా ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే ఈ దఫా బడ్జెట్ ప్రసంగంలో కీలకమైన నదుల అనుసంధానం కోసం డీపీఆర్ లు కూడా ఖరారయ్యాయని కూడా కేంద్ర మంత్రి ప్రకటించారు. నదుల అనుసంధానం చేయడం వల్ల వ్యవసాయంతో పాటు పారిశ్రామిక అవసరాలకు, తాగు నీటి కొరతను నివారించే అవకాశాలుంటాయని నీటి పారుదల శాఖ నిపుణులు చెబుతున్నారు.
పంటల మద్దతు ధరకు రూ.2.37 లక్షల కోట్లు
Farmers పండించిన crop మద్దతు ధర కల్పించేందుకు గాను రూ. 2.37 లక్షల కోట్లను బడ్జెట్ లో కేటాయించినట్టుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 2021-22 రబీ సీజన్ లో 163 లక్షల మంది రైతుల నుండి 1,208 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు, వరిని సేకరించనున్నట్టుగా తెలిపారు. ఇందుకు గాను రూ.2.37 లక్షల కోట్లను చెల్లించనున్నామన్నారు.
Agriculture, గ్రామీణ స్టార్టప్‌లకు ఆర్ధిక సహాయం అందించేందుకు నిధిని ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వ్యవసాయంలో స్టార్టప్ లకు ఆర్ధిక సహాయం చేయడానికి నాబార్డ్ ద్వారా మూలధనంతో కూడిన నిధిని ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి వివరించారు.