అమ్మాయిలకు నిర్మలమ్మ వరం.. భారీగా తగ్గనున్న బంగారం ధరలు..!
ఈ బడ్జెట్ లో నిర్మలాసీతారామన్ అమ్మాయిలకు గొప్ప వరం ఇచ్చారు. నిజం చెప్పాలంటే అమ్మాయిలకు మాత్రమే కాదు.. ఇది భారతీయులు అందరికీ సూపర్ గుడ్ న్యూస్. అదేంటో కాదు.. త్వరలోనే బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే... ఈ బడ్జెట్ లో నిర్మలాసీతారామన్ అమ్మాయిలకు గొప్ప వరం ఇచ్చారు. నిజం చెప్పాలంటే అమ్మాయిలకు మాత్రమే కాదు.. ఇది భారతీయులు అందరికీ సూపర్ గుడ్ న్యూస్. అదేంటో కాదు.. త్వరలోనే బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి.
కేంద్ర బడ్జెట్ లో భాగంగా సుంకం తగ్గించారు. ఈ సుంకం తగ్గించడం వల్ల దేశంలో చాలా వస్తువుల ధరలు తగ్గిపోనున్నాయి. మరి.. ఏయే వస్తువుల ధరలు తగ్గనున్నాయో ఇప్పుడు చూద్దాం...
బంగారం ధరలు తగ్గుతాయి
క్యాన్సర్ ఔషధాలు, మెడికల్ పరికరాల ధరలు తగ్గనున్నాయి.
ఎక్స్ రే ట్యూబ్ లు, ఇతర వైద్య పరికరాల ధరలు తగ్గనున్నాయి.
మొబైల్ ఫోన్ ధరలు.. సంబంధిత పరికరాల ధరలు కూడా తగ్గనున్నాయి.
లిథియం, కాపర్, కోబాల్ట్ ధరలు తగ్గనున్నాయి.
స్పేస్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు, తోలు, చెప్పుల ధరలు కూడా తగ్గుతాయి.
చేపలు, రోయ్యల మేత, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు కూడా తగ్గనున్నాయి.
ఇన్ని వస్తువుల్లో బంగారం, వెండి ధరలు తగ్గడం మాత్రం అందరినీ సంతోషానికి గురి చేస్తుంది. ఎందుకంటే... గత కొన్ని సంవత్సరాలుగా.. బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది. ఎంతలా అంటే తులం బంగారం దాదాపు రూ.70వేలకు చేరుకుంది. మధ్యతరగతి ఫ్యామిలీస్ కి.. బంగారం కొనడం అంటే చాలా కష్టంగా మారింది. మరి.. ఇప్పుడు బంగారం ధరలు తగ్గితే.. వారందరికీ కాస్త ఊరటగానే ఉంటుంది. మరి.. ఎంత వరకు తగ్గుతుందో చూడాలి.