Asianet News TeluguAsianet News Telugu

Union Budget 2022-23: ఎల్‌ఐసీ ఐపీఓపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎమన్నారంటే..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం ఇది వరుసగా నాలుగో సారి. పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు.. Parliament ఆవరణలో సమావేశమైన కేంద్ర కేబినెట్ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది.

budget 2022 Nirmala Sitharaman says LIC IPO expected shortly
Author
New Delhi, First Published Feb 1, 2022, 11:51 AM IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం ఇది వరుసగా నాలుగో సారి. పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు.. Parliament ఆవరణలో సమావేశమైన కేంద్ర కేబినెట్ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. వచ్చే 25 ఏళ్ల కాలానికి ఈ బడ్జెట్ పునాది అని చెప్పారు. భారత్‌ను అగ్రదేశంగా నిలబెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టుగా తెలిపారు. డీబీఐ ద్వారా పేదలకు నేరుగా ఆర్థిక సాయం లభిస్తుందన్నారు. 

గత సంవత్సరం బడ్జెట్ గణనీయమైన పురోగతిని సాధించిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రభుత్వం ఎయిరిండియా విక్రయాన్ని పూర్తి చేసిందని..  ఒడిశాకు చెందిన నీలాంచల్ ఇస్పాత్ కోసం బిడ్లను ఖరారు చేసిందని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. త్వరలోనే ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ రాబోతుందని వెల్లడించారు. 

దేశ చరిత్రలోనే అతి పెద్దదిగా చెబుతున్న ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ జారీకి సంబంధించిన ప్రస్తుతం కీలకం కానుంది. ఎందుకంటే.. మార్చి 2022తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న భారీ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.1.75 లక్షల కోట్లకు చేరువ కావాలంటే LIC IPO చాలా కీలకం. కాగా ఎల్‌ఐసీ ఇష్యూ వీలైనంత త్వరగా మార్కెట్‌లోకి వచ్చే వీలుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఇదే విషయాన్ని స్పష్టం చేసేలా ఉంది.

ఎల్‌ ఐసీ ఇష్యూ నిర్వహణ కోసం ప్రభుత్వం గత సెప్టెంబరులో 10 మంది మర్చంట్‌ బ్యాంకర్లను నియమించింది. సిరిల్‌ అమర్‌చంద్‌ మంగళదాస్‌ను న్యాయ సలహాదారుగా నియమించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios