Budget 2022: బడ్జెట్ ప్రతిపాదనకు నిర్మలమ్మ రెడీ, వివరాలు ఇవీ...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23కు గాను పార్లమెంటులో బడ్జెట్ ను ప్రతిపాదించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు పార్లమెంటు సమావేశాలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగంతో ప్రారంభమవుతాయి.
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన 200223 సంవత్సరానికి గాను బజ్జెట్ ప్రతిపాదించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అదికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి Budgetను ప్రతిపాదించడం ఇది పదోసారి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 తేదీన ప్రారంభమవుతాయి.
జనవరి 31వ తేదీన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారని పార్లమెంటు వ్యవహారాల మంత్రిత్వశాఖ అదనపు సెక్రటరీ జనరల్ చెప్పారు. రాజ్యసభ, లోకసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. తొలి దశ బడ్జెట్ సమావేశాలు జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు జరుగుతాయి. తిరిగి మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 8 తేదీ వరకు జరుగుతాయి.
బడ్జెట్ ప్రతిపాదనకు ముందు జనవరి 31వ తేదీన ప్రభుత్వం ఆర్థిక సర్వే (Economic Survey)ను పార్లమెంటులో పెడుతుంది. దేశాన్ని కోవిడ్ మహమ్మారి మూడో వేవ్ తాకిన నేపథ్యంలో అందరి దృష్టి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించే బడ్జెట్ మీద ఉంది. జిడీపీ అంచనాలు కీలకమని భావిస్తున్నారు.
కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో విధించి వరుస లాక్ డౌన్ల కారణంగా 2020-21 వార్షిక దేశీయ స్థూల ఉత్పత్తి (GDP) నిరాశజనకంగా ఉంది. అయితే, ఒమిక్రాన్ వేరియంట్ జీడీపీ విషయంలో ఆటంకంగా మారే అవకాశం ఉంది. నిరుడు నిర్మలా సీతారామన్ టాబ్లెట్ తీసుకుని వచ్చి బడ్జెట్ ను ప్రతిపాదించారు. సంప్రదాయబద్దమైన బహీ - ఖాతాకు బదులుగా ఆమె ఆ విధంగా బడ్జెట్ ను ప్రతిపాదించారు. సభ్యులకు బడ్జెట్ వివరాలు అందుబాటులో ఉండడానికి మంత్రి బడ్జెట్ మొబైల్ యాప్ ను ప్రారంభించారు.