Asianet News TeluguAsianet News Telugu

మార్కెట్‌లోకి యమహా బీఎస్-6 బైక్‌లు.. ధర ఎంతంటే!

జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం ఇండియా యమహా మోటార్స్ (ఐవైఎం) భారతీయ మార్కెట్‌లోకి బీఎస్-6 శ్రేణి టూవీలర్లను విడుదల చేసింది. తన విజయవంతమైన ఎఫ్‌జెడ్ సిరీస్‌లో వీటిని పరిచయం చేసింది. 

Yamaha FZ-FI And FZS-FI BS6 Variants Launched In India Prices Start At  99,200
Author
Hyderabad, First Published Nov 10, 2019, 2:11 PM IST


చెన్నై: జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం ఇండియా యమహా మోటార్స్ (ఐవైఎం) భారతీయ మార్కెట్‌లోకి బీఎస్-6 శ్రేణి టూవీలర్లను విడుదల చేసింది. తన విజయవంతమైన ఎఫ్‌జెడ్ సిరీస్‌లో వీటిని పరిచయం చేసింది. తాజాగా రెండు మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఎఫ్‌జడ్ -ఎఫ్ఐ, ఎఫ్‌జడ్ఎస్-ఎఫ్ఐ పేరిట ఆవిష్కరించింది. 

కేవలం 2 నెలల్లో 10వేల అమ్మకాలు: రెనాల్ట్ ఇండియా

ఎఫ్‌జెడ్-ఎఫ్‌ఐ ధర రూ.99,200గా నిర్ణయించిన యమహా, ఇక ఎఫ్‌జెడ్‌ఎస్-ఎఫ్‌ఐ ధరల విషయానికొస్తే.. ఈ వేరియంట్‌లో రెండు రకాల బైక్‌లను ప్రవేశపెట్టింది. డార్క్‌నైట్ ధర రూ.1.02 లక్షలుగా ఉంటే, మెటాలిక్ రెడ్ ధర రూ.1.01 లక్షలుగా ఉందని సంస్థ వెల్లడించింది. 

ఎఫ్‌జడ్ -ఎఫ్ఐ, ఎఫ్‌జడ్ఎస్-ఎఫ్ఐ వాహనాలు రెండూ 150 సీసీ సామర్థ్యం కలిగి ఉన్నాయి. రెండు బైకుల్లోనూ ముందు వైపు సింగిల్ చానెల్ ఏబీఎస్ ఉంటుంది. ముందూ వెనుక డిస్క్ బ్రేక్ అమర్చారు. 

ఈ నెల నుంచి దేశవ్యాప్తంగా గల అన్ని యమహా షోరూముల్లో వీటిని విక్రయిస్తామని ఇండియా యమహా మోటార్స్ చైర్మన్ మోటో ఫుమి షితరా చెప్పారు.

రాబోయే నెలల్లో బీఎస్-6 ప్రమాణాలతో మరిన్ని బైక్‌లను తీసుకొస్తామని యమహా స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరిలో ఎఫ్‌జెడ్-ఎఫ్‌ఐ, ఎఫ్‌జెడ్‌ఎస్-ఎఫ్‌ఐ ఏబీఎస్ వేరియంట్లను యమహా ఇండియా మార్కెట్‌కు పరిచయం చేసిన విషయం తెలిసిందే. 

‘కంపాస్’ సెలబ్రిటీస్ జాబితాలో హరికేన్ కపిల్ దేవ్

వీటిలో ఇప్పుడు బీఎస్-6 శ్రేణి వాహనాలను ఆవిష్కరించింది. ప్రస్తుతం యమహా ఏబీఎస్ టెక్నాలజీతో వైజెడ్‌ఎఫ్-ఆర్3, వైజెడ్‌ఎఫ్-ఆర్15, ఎంటీ-15 వాహనాలను విక్రయిస్తుండగా, ఎఫ్‌జెడ్25, ఫేజర్, స్కూటర్, సిగ్నస్ రే జెడ్‌ఆర్, ఫాసినో తదితర వాహనాలను అమ్ముతున్నది. వాతావరణంలో కర్బన ఉద్గారాలు ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి బీఎస్6 ప్రమాణాలను కేంద్రం తప్పనిసరి చేస్తున్న విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios