గత కొంతకాలం నుండి హెల్మెట్ లేకుండా ప్రయాణించడం అంటే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంగించినట్టు. ఇందుకు వాహనదారుడు ట్రాఫిక్ చలాన్  చెల్లించాల్సి ఉంటుంది. భారతదేశంలో ప్రతి ఏడాది కొన్ని వందల మంది రోడ్డు ప్రమాదలలో మరణిస్తున్నారు.

ఈ ప్రమాదాలను తగ్గించడానికి, అరికట్టడానికి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి అనే నిభంధనను ప్రభుత్వం  ప్రవేశపెట్టింది. కొందరికి  హెల్మెట్ తో ప్రయాణించాక హెల్మెట్ ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తుంటారు, మరికొందరు దానిని పట్టుకోని తిరగడానికి ఆలోచిస్తుంటారు, ముఖ్యంగా ఆఫీసుకి వెళ్ళేవాళ్లు. 

సరస్వతి శిషు మందిర్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న కౌషల్  కు న్యూ ఢీల్లీలో ఇన్స్పైర్ అవార్డు లభించింది. అతనికి బహుమతిగా పదివేల రూపాయలు అందించారు.

also read ఆనంద్ మహీంద్రాని ఆశ్చర్యపరిచిన కారుని చూసారా.. టెస్లాని ట్యాగ్ చేస్తూ ట్వీట్.. నేట్టింట్లో వైరల్.. ...

పదవ తరగతి విద్యార్ధి అయిన కౌషల్ ఒక మడత హెల్మెట్‌ను సృష్టించాడు, దానిని ఎక్కడైనా, ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. కౌషల్ తండ్రి తాను చదివే పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నారు.

ఒకసారి తన తండ్రితో కలిసి బైక్‌పై వెళ్ళినప్పుడు, అతని తల సైజ్ కారణంగా హెల్మెట్‌ను ధరించడం, ఎత్తడం ఇబ్బంది పడ్డానని కౌషల్ చెప్పాడు.

అక్కడే అతనికి హెల్మెట్లు మడతపెట్టె లాగా ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన గుర్తుకు వచ్చింది. ఈ హెల్మెట్ పూర్తిగా మడవగలదు. అలాగే ప్రయాణించిన తరువాత హాయిగా మడత పెట్టవచ్చు. మరో విషయం ఏంటంటే ఈ హెల్మెట్ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా కూడా ఉందని కౌషల్ పేర్కొన్నారు.

కౌషల్ చదివే పాఠశాల ప్రిన్సిపాల్ ప్రకాష్ చంద్ర, కమలేష్ పాండే, ప్రదీప్ కుమార్, భువన్ చంద్, రాజ్‌కుమార్, దేవేంద్ర గంగ్వార్, రవి అరోరా, అతని తల్లి సావిత్రి దేవి కౌషల్ సృష్టించిన ఘనత పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కౌషల్‌ను అతని కుటుంబంని త్వరలో సత్కరిస్తుందని మున్సిపల్ చైర్మన్ దర్శన్ కోలి తెలిపారు.