టివిఎస్ మోటార్స్ అపాచీ బైక్ ధరల పెంపు.. ఎంతంటే ?
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి ధరలను మే 2020లో 2,000 పెంచింది. ఈ మోడల్ పై ధరల పెరుగుదల ఇది రెండవసారి.
టీవీఎస్ మోటార్ కంపెనీ బీఎస్6 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి ధరను రూ.1,050 పెంచింది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి డ్రమ్ బ్రేక్స్ ధర ఇప్పుడు 1,02,950 కు బదులుగా, 1,04,000 గా ఉండగా, డిస్క్ బ్రేక్ వెర్షన్ ధర ఇప్పుడు 1,06,000 నుండి 1,07,050గా పెంచింది.
అన్ని ధరలు ఢీల్లీ ఎక్స్-షోరూమ్. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి ధరలను మే 2020లో 2,000 పెంచింది. ఈ మోడల్ పై ధరల పెరుగుదల ఇది రెండవసారి. 2020 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి 159.7 సిసి, సింగిల్ సిలిండర్, ఫోర్-వాల్వ్, ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌తో ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పనిచేస్తుంది.
కొత్త బిఎస్ 6 ఆర్‌టిఆర్ 160 4వి 8,250 ఆర్‌పిఎమ్ వద్ద 15.8 బిహెచ్‌పిని, 7,250 ఆర్‌పిఎమ్ వద్ద 14.12 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఇస్తుంది. ఫ్యుయెల్-ఇంజెక్షన్‌తో కూడిన బిఎస్ 4 మోడల్ 8,000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్ట శక్తి 16.6 బిహెచ్‌పి, 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 14.8 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను అందిస్తుంది.
also read వచ్చేసింది మారుతి సుజుకి ఎస్-క్రాస్ పెట్రోల్ వెర్షన్.. ధర, మైలేజ్ ఎంతో తెలుసా ? ...
సస్పెన్షన్ లో టెలిస్కోపిక్ ఫోర్క్స్ అప్ ఫ్రంట్, వెనుక భాగంలో మోనోషాక్ ఉంది. డిస్క్ బ్రేక్‌లు ఇరువైపులా బైక్ అపెందుకు జాగ్రత్తలు తీసుకుంటాయి. వెనుక డిస్క్ బ్రేక్ ఆప్షనల్ గా ఉంటుంది. ఈ బైక్ స్టాండర్డ్ డ్యూయల్-ఛానల్ ఎబిఎస్‌ను పొందుతుంది.
బిఎస్ 6 అపాచీ 160 4వి బ్లాక్ అండ్ వైట్ షేడ్స్‌లో లభిస్తుంది, కాంట్రాస్ట్ రేసింగ్ డెకాల్స్, ఫ్లై స్క్రీన్. ఫీచర్స్ లేదా స్పెసిఫికేషన్లలో ఎలాంటి మార్పులు లేవు. అపాచీ ఆర్‌టిఆర్ 160 4వి లాగానే, అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి ధరలను కూడా రూ.1,050 పెంచింది. ఇప్పుడు ఈ బైక్ ధర రూ. 128,550 (ఎక్స్-షోరూమ్, ఢీల్లీ).