Asianet News TeluguAsianet News Telugu

కే‌టి‌ఎం, కవాసకి బైకులకి పోటీగా ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్ లాంచ్.. ధర ఎంతంటే ?

ట్రయంఫ్ మోటార్ సంస్థ ఇప్పటికే షోరూమ్‌లలో లక్ష రూపాయల టోకెన్ మొత్తానికి స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ కోసం బుకింగ్ తీసుకోవడం ప్రారంభించాయి. స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్ భారతదేశంలో ఇంతకు ముందు అందించిన బేస్ మోడల్ అయిన స్ట్రీట్ ట్రిపుల్ ఎస్ స్థానంలో ఉంటుంది. 

Triumph Motorcycles has launched the 2020 Triumph Street Triple R in india
Author
Hyderabad, First Published Aug 11, 2020, 12:56 PM IST

ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఇండియా 2020 ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ ను ఇండియాలో లాంచ్ చేసింది. కొత్త నేకెడ్ మిడిల్‌వెయిట్ బైక్ ధర రూ.8.84 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢీల్లీ). టాప్-స్పెసిఫికేషన్ ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ ధర రూ.11.33 లక్షలు (ఎక్స్-షోరూమ్,ఢీల్లీ).

ట్రయంఫ్ మోటార్ సంస్థ ఇప్పటికే షోరూమ్‌లలో లక్ష రూపాయల టోకెన్ మొత్తానికి స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ కోసం బుకింగ్ తీసుకోవడం ప్రారంభించాయి. స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్ భారతదేశంలో ఇంతకు ముందు అందించిన బేస్ మోడల్ అయిన స్ట్రీట్ ట్రిపుల్ ఎస్ స్థానంలో ఉంటుంది.

ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ అదే 765 సిసి, ఇన్-లైన్ త్రీ-సిలిండర్ ఇంజిన్‌, అయితే కాస్త తక్కువగా ట్యూన్ చేయబడింది. స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ 12,000 ఆర్‌పిఎమ్ వద్ద 116 బిహెచ్‌పి, 11,750 ఆర్‌పిఎమ్ వద్ద 121 బిహెచ్‌పి ఉత్పత్తి చేస్తుంది.

also read టివిఎస్ మోటార్స్ అపాచీ బైక్ ధరల పెంపు.. ఎంతంటే ? ...

పీక్ టార్క్ అవుట్పుట్ 9,350 ఆర్‌పిఎమ్ వద్ద 79 ఎన్‌ఎమ్ ఉంది, స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైక్ అవుట్‌పుట్‌ కూడా సమానంగా ఉంటుంది. 'ఆర్' మోడల్‌లోని రంగులు, గ్రాఫిక్స్ భిన్నంగా ఉంటాయి. స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైక్ 168 కిలోల బరువు, 'ఆర్' బైక్ 168 కిలోల బరువు ఉంటుంది.

డిజైన్ పరంగా రెండు మోడల్స్ ఒకేలాగా కనిపిస్తాయి, కొత్త రంగులు, ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, వెనుక ఫ్రేమ్ ఎరుపు రంగులో ఉంటాయి. స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ రోడ్, రైన్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లతో పాటు రైడ్-బై-వైర్‌ మోడ్ కూడా ఉంది.

రెయిన్ మోడ్ ఆన్ చేయడంతో పవర్ ఉత్పత్తి 98.63 బిహెచ్‌పికి లిమిట్ చేయబడింది. ఏ‌బి‌ఎస్, ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. ట్రయంఫ్ పిరెల్లి డయాబ్లో రోసో III టైర్లతో పాటు స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ లో బిడ్-డైరెక్షనల్ క్విక్-షిఫ్టర్‌ను అందిస్తుంది.

2020 స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బ్లాక్, మాట్ సిల్వర్ ఐస్ అనే రెండు రంగులలో లభిస్తుంది. 2020 ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ కే‌టి‌ఎం 790 డ్యూక్, కవాసకి జెడ్900లకు పోటీగా ఉంటుంది. కవాసాకి 'బిఎస్ 6 మోడల్ ఇప్పటికే సేల్స్ ప్రారంభీంచగా, కే‌టి‌ఎం డ్యూక్  790 బిఎస్ 6  త్వరలో సేల్స్  ప్రారంభించనుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios