న్యూఢిల్లీ: చైనా దిగుమతులు బహిష్కరించాలన్న పిలుపునకు దేశీయంగా తయారీ రంగన్ని మరింతగా విస్తరించడమే సమాధానం అని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. భారతదేశంలోని తయారీ సంస్థలు పోటీ సామర్థ్యం గణనీయంగా పెంచుకోవాల్సి ఉంటుందని ఆర్సీ భార్గవ అన్నారు.

అదే సమయంలో పొరుగు దేశం నుంచి ఉత్పత్తులు బహిష్కరించడం అంటే కొనుగోలు చేసే వస్తువులకు అధిక ధరలు చెల్లించాల్సి ఉంటుందనే విషయం కూడా గమనించాలని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్సీ భార్గవ చెప్పారు. సుదీర్ఘకాలం పాటు దిగుమతుల పైనే ఆధారపడటం అనేది వాణిజ్య ప్రయోజనాల రీత్యా ఏ మాత్రం మంచిది కాదన్నారు. 

స్వదేశంలో వాటి లభ్యత కొరత, నాణ్యత, ధరలు తదితర విషయాలను ద్రుష్టిలో ఉంచుకుని దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని ఆర్సీ భార్గవ చెప్పారు.దిగుమతులు పెరిగిన కొద్ది ధరలు కూడా పెరిగి రూపాయి బలహీనం అవుతుందని పేర్కొన్నారు. 10 ఏళ్ల క్రితం దిగుమతి చేసుకున్న వస్తువు ధరలు ప్రస్తుతం 60 నుంచి 70 శాతం పెరిగిపోయాయి. 

భారీగా ధరలు పెరిగినప్పుడు మరో అవకాశం లేనప్పుడు మాత్రమే వస్తువులను దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని ఆర్సీ భార్గవ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ముడిపడిన ప్రశ్నలకు భారతదేశంలో తయారీ రంగాన్ని మరింత బల పరిచి, పోటీ తత్వాన్ని పెంపొందించి, విస్త్రుత పర్చడమేనన్నారు. 

also read జెఫ్ బెజోస్ ఓ కాపీ క్యాట్​: టెస్లా అధినేత ఎలాన్​ మస్క్​ వెటకారం ...

భారత తయారీ సంస్థలు పోటీ సామర్థ్యం పెంచుకోవాలన్నదే ప్రధాని ఆత్మనిర్భర్‌ భారత్‌ ద్వారా ఇచ్చిన ముఖ్య సందేశమని ఆర్సీ భార్గవ వెల్లడించారు. దిగుమతుల బహిష్కరణ లాభమా? నష్టమా అనేది ఆ వస్తువు అత్యవసర స్వభావం కలిగినదా, కాదా అన్న దాని మీద ఆధారపడి ఉంటుందన్నారు.

అత్యవసర వస్తువు అయితే మాత్రం చైనా కన్నా మనకే నష్టం అధికంగా ఉంటుందని ఆర్సీ భార్గవ వివరించారు. దేశంలో సరైన దిగుమతి ప్రత్యామ్నాయాలు తయారుచేస్తే తప్ప దిగుమతులు తప్పనిసరి అవుతాయని చెప్పారు. 

ఉదాహరణకి ఒక కారు తయారీలో 2 శాతం పరికరాలు చైనా నుంచి దిగుమతి చేసుకున్నవి ఉపయోగిస్తున్నారనుకుంటే ఆ పరికరాల దిగుమతిని బహిష్కరించి కారు తయారు చేయడం నిలిపిపేస్తే నష్టం ఎవరికో కూడా మదింపు చేసుకోవలసి ఉంటుందని భార్గవ అన్నారు.

అవసరమైన ఉత్పత్తుల దిగుమతులు నిలిపివేస్తే మనదేశం మీద ఎటువంటి ప్రభావం చూపదని ఆర్సీ భార్గవ చెప్పారు. ఒకవేళ అవసరమైన ఉత్పత్తులను బహిష్కరిస్తే చైనాకు జరిగే నష్టం కంటే మనకే ఎక్కువ నష్టం అని తెలిపారు.