Asianet News TeluguAsianet News Telugu

అడ్వెంచర్ బైక్ రైడర్స్ కోసం సుజుకి కొత్త వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి బైక్.. ధర ఎంతో తెలుసా ?

భారతదేశంలో వి- స్ట్రోమ్ 650ఎక్స్‌టి ఏ‌బి‌ఎస్ బైకుని విడుదల చేసింది. ఈ బైక్ సంస్థ యొక్క 'డు-ఇట్-ఆల్' మోటార్ సైకిల్ / అడ్వెంచర్ టూరర్ బి‌ఎస్6 వేరియంట్. ఈ బైక్ ద్వారా భారతదేశంలో బిఎస్ 6 ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయాలని సుజుకి భావిస్తోంది.

suzuki motorcycle launches bs6 v strom 650xt abs know features specifications and price of  it in india
Author
Hyderabad, First Published Nov 23, 2020, 6:53 PM IST

సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్ (ఎస్‌ఎం‌ఐ‌పి‌ఎల్) భారతదేశంలో వి- స్ట్రోమ్ 650ఎక్స్‌టి ఏ‌బి‌ఎస్ బైకుని విడుదల చేసింది. ఈ బైక్ సంస్థ యొక్క 'డు-ఇట్-ఆల్' మోటార్ సైకిల్ / అడ్వెంచర్ టూరర్ బి‌ఎస్6 వేరియంట్.

ఈ బైక్ ద్వారా భారతదేశంలో బిఎస్ 6 ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయాలని సుజుకి భావిస్తోంది. ఈ బైకుని ఆటో ఎక్స్‌పో 2020లో ప్రదర్శించారు. వి- స్ట్రోమ్ 650ఎక్స్‌టి ఏ‌బి‌ఎస్ ఎస్‌ఎం‌ఐ‌పి‌ఎల్ పోర్ట్‌ఫోలియోలో మొదటి అతిపెద్ద బి‌ఎస్6 బైక్.

అడ్వెంచర్ ఔత్సాహికులను దృష్టిలో ఉంచుకుని ఈ బైకుని రూపొందించామని కంపెనీ తెలిపింది. రోజువారీ రాకపోకలు,  లాంగ్ జర్నీలకు,  కఠినమైన భూభాగాలలో ఈ బైక్ అనుకూలంగా ఉంటుంది. ఎస్‌ఎం‌ఐ‌పి‌ఎల్ జపాన్ కు చెందిన ఆటో మొబైల్ కంపెనీ సుజుకి మోటార్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ.

సుజుకి వి-స్ట్రోమ్ 650 ఎక్స్‌టి ఎబిఎస్ ఫోర్-స్ట్రోక్ లిక్విడ్-కూల్డ్, DOHC, 90 ° వి- ట్విన్ ఇంజిన్‌ ఉంది. అడ్వెంచర్ బైక్‌ను కోరుకునే వారికి ఎవరికైనా ఈ బైక్ అనువైన, ఆకర్షణీయమైన ఆప్షన్. మోటారుసైకిల్‌లో సుజుకి ఈజీ స్టార్ట్ సిస్టమ్ అందించారు, తద్వారా కిక్ స్టార్ట్ వంటి మొదలైన ఇబ్బంది ఉండదు, కానీ సింగిల్ బటన్‌ను నొక్కడం ద్వారా బైక్ స్టార్ట్ అవుతుంది.

ఈ మిడిల్‌వెయిట్ అడ్వెంచర్ టూరర్‌కు లైట్ వెయిట్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఎబిఎస్ లభిస్తుంది, ఇది రోడ్డు మీద డ్రైవింగ్ చేసేటప్పుడు మంచి పట్టును ఇస్తుంది. ఇది క్లిష్ట పరిస్థితులలో అద్భుతమైన బ్రేకింగ్ పనితీరును కూడా అందిస్తుంది.

ఈ బైక్ 3 మోడ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. ఇది ఇంజన్‌పై మంచి నియంత్రణను ఇస్తుంది. బిఎస్ 6 కంప్లైంట్ వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి  ఎబిఎస్ బైక్ బ్యాలెన్స్, మంచి పనితీరు, శక్తి, నియంత్రణకు సరైన ఉదాహరణ అని కంపెనీ పేర్కొంది.

also read 11 కొత్త కలర్ ఆప్షన్లలో యమహా ఎం‌టి-15 బైక్.. ధర ఎంతంటే ? ...


ఈ బైక్ ఫీచర్స్ :
- 4 స్ట్రోక్, 2 సిలిండర్ లిక్విడ్ కూల్డ్, డి‌ఓ‌హెచ్‌సి, 90 డిగ్రీ వి-ట్విన్ ఇంజన్
- లైట్ వెయిట్ ఏ‌బి‌ఎస్
- సౌకర్యవంతమైన రైడింగ్ సీట్
- ఇన్ఫర్మేటివ్ మల్టీ ఫంక్షనల్ ప్యానెల్
-  స్టైలిష్ ఎల్‌ఈ‌డి టైల్ లైట్స్
- స్లిమ్ బాడీ నిర్మాణం

బైక్ ధర :
 బిఎస్ 6 వి-స్ట్రోమ్ 650 ఎక్స్‌టి ఎబిఎస్ ధర రూ.8,84,000 (ఎక్స్-షో రూమ్ ధర - ఢీల్లీ). ఈ బైక్‌  రెండు రంగులు అందుబాటులో ఉంది. మొదటి వేరియంట్ ఛాంపియన్ ఎల్లో, రెండవది - పెర్ల్ వైట్. ఈ బైక్‌లు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన సుజుకి డీలర్‌షిప్‌లలో లభిస్తాయి.

దేశంలో లభించే టాప్ 5 అడ్వెంచర్ బైక్‌లు ఇవి:
హీరో ఎక్స్‌పుల్స్ 200
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్
బిఎమ్‌డబ్ల్యూ జి 310 జిఎస్
కవాసాకి వెర్సిస్ ఎక్స్ 300
ట్రయంఫ్ టైగర్ 800 ఎక్స్‌సిఎక్స్

Follow Us:
Download App:
  • android
  • ios