ద్విచక్ర వాహన సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటిరియర్ 350 లాంచ్ తేదీని ప్రకటించడమే కాకుండా, రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ కొత్త రైడింగ్ జాకెట్ కలెక్షన్ కూడా ప్రారంభించింది. ఈ జాకెట్లు సి‌ఈ సర్టిఫైడ్ మల్టీ రైడింగ్ అవసరాల కోసం విభిన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.

జాకెట్ల ధరలు రూ.4,950 నుండి ప్రారంభమై రూ.14,950 వరకు ఉంటుంది. సి‌ఈ సర్టిఫికేట్ పొందడంతో పాటు జాకెట్లు డి30, నాక్స్ బాడీ ఆర్మర్ కూడా ఉంది, సి‌ఈ లెవెల్ 1 ఇంకా సి‌ఈ లెవెల్ 2 రేటింగ్‌ల కూడా పొందింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ రైడింగ్ జాకెట్లు వివిధ రకాల పరిస్థితుల కోసం పూర్తిగా పరీక్షించబడిందని చెప్పారు.

స్ట్రీట్ విండ్ వి2 (సిటీ రేంజ్) ధర  రూ.4,950

విండ్‌ఫేరర్ (సిటీ రేంజ్) ధర  రూ.6,950

ఎక్స్‌ప్లోరర్ వి3 (హైవే టూరింగ్ రేంజ్)ధర  రూ. 9 8,950 (సిఇ-రేటెడ్)

also read టీవీఎస్‌ ఎన్‌టార్క్‌ 125 సీసీ ఎవెంజర్స్‌ ఎడిషన్‌.. బ్లూటూత్ కనెక్ట్ ఫీచర్ కూడా.. ...

స్టార్మ్‌రైడర్ (హైవే టూరింగ్ రేంజ్)ధర  రూ.9 9,950 (సిఇ- రేటెడ్)

సాండర్స్ (హైవే టూరింగ్ రేంజ్)ధర  రూ.11,950 (సిఇ- రేటెడ్)

ఖార్డంగ్ లా వి2 (ఆల్-టెర్రైన్ రేంజ్)ధర  రూ.12,950 (సిఇ-రేటెడ్)

నిర్విక్ (ఆల్-టెర్రైన్ రేంజ్)ధర  రూ.14,950 (సిఇ- రేటెడ్)

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్తగా ప్రారంభించిన రైడింగ్ జాకెట్స్ గురించి మాట్లాడుతూ, "రాయల్ ఎన్‌ఫీల్డ్ దుస్తులు & గేర్ బిజినెస్ రైడర్ భద్రతపై స్పష్టమైన దృష్టితో రైడర్‌లకు మొత్తం మోటార్‌సైక్లింగ్ అనుభవాన్ని పెంచడంపై దృష్టి పెట్టింది.

కొత్తగా ప్రారంభించిన రైడింగ్ జాకెట్ల కలెక్షన్ మోటారుసైకిలిస్టులకు సౌకర్యవంతంగా, స్టైలిష్‌గా ఉంటాయి. ఈ కొత్త రేంజ్ సి‌ఈ సర్టిఫైడ్ రైడింగ్ జాకెట్లు ప్రపంచ భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. బడ్జెట్ ధర, సులభంగా ధరించడానికి, రైడర్స్ విభిన్న అవసరాలను తీర్చడానికి రూపొందించబడ్డాయి."  అని అన్నారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ రైడింగ్ జాకెట్స్ కలెక్షన్స్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ నుండి లేదా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్‌షిప్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు. అలాగే ఈ జాకెట్లను అమెజాన్, హైదరాబాద్ సెంట్రల్, షాపర్ స్టాప్ అవుట్లెట్ల నుండి కూడా కొనుగోలు చేయవచ్చు,