లంబోర్ఘిని లిమిటెడ్ ఎడిషన్ వాచ్‌ను లాంచ్ చేసిన రోజర్ డబుయిస్.. ధర తెలిస్తే షాక్ అవుతారు..
ఈ సూపర్ ఎక్స్‌క్లూజివ్ వాచ్ లు కేవలం 88 యూనిట్లు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. అందువల్ల ఇది యునైటెడ్ స్టేట్స్లో లో 56,500 డాలర్ల స్టిక్కర్ ధరతో లభిస్తుంది.
స్విస్ వాచ్‌మేకర్ రోజర్ డుబూయిస్ ఇటీవల విడుదల చేసిన లంబోర్ఘిని హురాకాన్ ఎస్‌టిఓ సూపర్ కార్ ప్రేరణతో కొత్త ఎక్స్‌కాలిబర్ రేంజ్ గడియారాలను లాంచ్ చేసింది. ఈ సూపర్ ఎక్స్‌క్లూజివ్ వాచ్ లు కేవలం 88 యూనిట్లు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి.
అందువల్ల ఇది యునైటెడ్ స్టేట్స్లో లో 56,500 డాలర్ల స్టిక్కర్ ధరతో లభిస్తుంది, అంటే ఇండియా ప్రకారం దీని ధర సుమారు రూ.42 లక్షలు. రోజర్ డబుయిస్ ఎక్సాలిబర్ స్పైడర్ హురాకాన్ ఎస్‌టిఓ బ్లూ లాఫీ, కాలిఫోర్నియా ఆరెంజ్ రంగులలో వస్తుంది, ఇవి హురాకాన్ ఎస్‌టిఓ కార్ రంగులు.
ఎక్సాలిబర్ టైమ్‌పీస్ ఆటోమేటిక్ ఆర్‌డి630 క్యాలిబర్‌తో వస్తుంది, ఇది కారు గ్రిల్‌ను హైలైట్ చేస్తుంది. లంబోర్ఘిని స్క్వాడ్రా కోర్స్‌తో కలిసి రోజర్ డుబూయిస్ ఈ వాచ్ ని ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. ఈ వాచ్ డిజైన్, డైయల్ మొత్తం లంబోర్ఘిని కారు పోలికలతో రూపొందించారు.
also read ఇండియాలో మరొక బ్యాంక్ మూసివేత.. వినియోగదారుల డిపాజిట్లపై ఆర్‌బిఐ క్లారిటి.. ...
కొత్త లంబోర్ఘిని హురాకాన్ ఎస్‌టిఓ లేదా సూపర్ ట్రోఫియో ఓమోలోగాటా ఇటాలియన్ మార్క్ నుండి రోడ్-లీగల్ రేస్ కారు. అంతకుముందు వాటితో పోలిస్తే కొత్త హురాకాన్ ఎస్‌టిఓ కార్ 43 కిలోల బరువు తక్కువైనది, ఎందుకంటే ఈ కారులో 75 శాతం బాడీవర్క్ కోసం కార్బన్ ఫైబర్‌ను ఉపయోగించింది.
కొత్త కలర్, డిజైన్ అప్ డేట్ తో పాటు, ఏరోడైనమిక్ సామర్థ్యం 37 శాతం పెరిగింది, కారు హురాకాన్ పెర్ఫార్మంటే కంటే 53 శాతం అధిక డౌన్‌ఫోర్స్ ఉంది.
హురాకాన్ ఎస్‌టిఓ కార్ 5.2-లీటర్ వీ10 ఇంజిన్, 630 బిహెచ్‌పి, 565 ఎన్‌ఎం టార్క్ కోసం ట్యూన్ చేయబడింది. ఈ కారు 3 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని, 0 నుండి 200 కిలోమీటర్ల వేగాన్ని 9 సెకన్లలో అందుకుంటుంది, ఈ కారు టాప్ స్పీడ్ 310 కిలోమీటర్లు.