ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఓలా చార్జింగ్ స్టేషన్లు.. ఒకేసారి ఇండియాతో పాటు విదేశాల్లో ఏర్పాటు..
ఓలా భారతదేశంలోని ప్రధాన నగరాలతో పాటు యూరప్‌లోని పలు ప్రదేశాలలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను నిర్మించడానికి చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫాం ఓలా భారతదేశంలోని ప్రధాన నగరాలతో పాటు యూరప్‌లోని పలు ప్రదేశాలలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను నిర్మించడానికి చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
రాష్ట్రంలో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇటీవల ప్రకటించింది.
మౌలిక సదుపాయాల ప్రపంచ నెట్‌వర్క్‌ను నిర్మించడానికి ఓలా భారతదేశంలోని 50 నగరాల్లో, యూరప్‌లోని పలు కీలక ప్రదేశాలలో స్థలం కోసం వెతుకుతోంది. వ్యూహాత్మకంగా ఉన్న ఈ సెటప్‌లను ఓలా కస్టమర్లు తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను వేగంగా ఛార్జ్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు.
also read 2017లోనే కంపెనీని అమ్మివేయాలని అనుకున్న.. కానీ వారు దానికి నిరాకరించారు: టెస్లా సీఈవో ...
ఓలా ఇ-స్కూటర్లలో తొలగించగల బ్యాటరీతో వస్తున్నట్లు, అలాగే ఛార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్ లో ఛార్జింగ్ అవసరాల గురించి ఏవైనా సమస్యలను ఉంటే పరిష్కరిస్తుంది. ఓలా రాబోయే నెలల్లో మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ న విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది.
కొత్త ఉత్పాదక కర్మాగారం ఏడాది వ్యవధిలో కార్యరూపంలోకి రానుందని భావిస్తున్నారు. ఇందుకోసం సాఫ్ట్‌బ్యాంక్ ఆధారిత సంస్థ రూ.2,400 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ కర్మాగారం పూర్తయిన తర్వాత ఇది దాదాపు 10వేల ఉద్యోగాలను సృష్టిస్తుంది అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద స్కూటర్ తయారీ కేంద్రంగా నిలుస్తుంది, ప్రారంభంలో 20 లక్షల యూనిట్ల వార్షిక సామర్థ్యంతో ప్లాంటు రానుంది.
ఈ కర్మాగారం భారతదేశంలోనే కాకుండా యూరప్, ఆసియా, లాటిన్ అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లలో వినియోగదారులకు ఉపయోగపడుతుంది.
ఎలక్ట్రిక్ వాహన (ఇవి) రంగంలో ఇంజనీరింగ్, డిజైన్ సామర్థ్యాలను పెంచడానికి ఈ ఏడాది మేలో అమ్‌స్టర్‌డ్యామ్‌కు చెందిన ఇటెర్గో బీవీని కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ వ్యాపారం కోసం 2 వేల మందికి పైగా నియమకా ప్రణాళికలను కూడా ప్రకటించింది.
ఓలా ఈవి ఆర్మ్ అయిన ఓలా ఎలక్ట్రిక్ టైగర్ గ్లోబల్, మ్యాట్రిక్స్ ఇండియా, టాటా సన్స్ చైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా, ఇతరుల నుండి సుమారు 400 మిలియన్ డాలర్లు నిధులను సేకరించింది.