Asianet News TeluguAsianet News Telugu

ఒకినావా ఎలక్ట్రిక్ వాహనాలపై ఫెస్టివల్ ఆఫర్.. లక్కీ డ్రా ద్వారా స్కూటర్‌ పొందే ఛాన్స్..

 భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ అయిన ఒకినావా ఫెస్టివల్  సీజన్‌లో కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. దసరా, దీపావళి పండుగ సీజన్‌ని దృష్టిలో పెట్టుకొని ఒకినావా ఒక లక్కీడ్రాని ప్రవేశపెట్టింది. 

Okinawa announces festive offers on its array of electric two wheelers in India-sak
Author
Hyderabad, First Published Oct 29, 2020, 4:01 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్, అక్టోబర్ 29, 2020: ‘‘మేక్ ఇన్ ఇండియా’’పై దృష్టి సారించేందుకు భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ అయిన ఒకినావా ఫెస్టివల్  సీజన్‌లో కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. దసరా, దీపావళి పండుగ సీజన్‌ని దృష్టిలో పెట్టుకొని ఒకినావా ఒక లక్కీడ్రాని ప్రవేశపెట్టింది.

ఈ లక్కీ డ్రా ద్వారా 10 మంది కొనుగోలుదారులు కేవలం రూ.30లకే ఒకినామా స్లో స్పీడ్ స్కూటర్‌ని ఇంటికి తీసుకెళ్లే అవకాశాన్ని పొందువచ్చు. ఈ ఆఫర్  24 అక్టోబర్ 2020 నుంచి 15 నవంబర్ 2020 వరకు అందుబాటులో ఉంటుంది. లక్కీ డ్రా ఫలితాలు  30 నవంబర్ 2020 నాడు ప్రకటించనున్నారు. 

ప్రతి కస్టమర్ తో పండుగ వేడుకల్ని పంచుకోవడానికి ఒకినావా బ్రాండ్ ప్రతి బుకింగ్‌పై ఖచ్చితమైన బహుమతులను సైతం ప్రకటించింది. దీనికి అదనంగా కొనుగోలుదారుల ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బుకింగ్‌ల పై రూ.6వేల  విలువైన  గిప్ట్ ఓచర్‌లను కూడా పొందుతారు. 

కస్టమర్లు మరింత సౌకర్యవంతంగా వాహనాలను బుక్ చేసుకోవడం కోసం బ్రాండ్ ఇటీవల వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్ లాంఛ్ చేసింది. ఒకినావా డిజిటల్ ఫ్లాట్‌ఫారం ద్వారా కొనుగోలుదారులు అనేక ఆప్షన్‌ల నుంచి కస్టమ్ థీమ్ పెయింటెడ్ స్కూటర్‌లను కూడా ఎంచుకోవచ్చు.

ప్రత్యేక ధీమ్‌లు ప్రొఫెషనల్ ఆర్టిస్టుల ద్వరా అత్యధిక నాణ్యత కలిగిన పెయింట్‌లు ఉపయోగించి డిజైన్ చేయబడ్డాయి. 

also read మీ కారు/బైకుకి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ విరిగిపోయిందా.. అయితే ఏం చేయాలో ఈ నియమాలను తెలుసుకోండి.. ...

“కరోనా మహమ్మారి కారణంగా ఆటోమొబైల్ రంగంతో సహా అనేక ఇండస్ట్రీల్లో మందగమనాన్ని ఎదుర్కొన్నాయి. అయితే, లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాత మా కస్టమర్ల నుంచి మాకు భారీగా ప్రతిస్పందన లభించింది.

ఇప్పుడు ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ తమ వ్యక్తిగత వాహనాల కొనుగోలు విషయంలో ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. సమాజంలో ఐ‌సి‌ఈ నుంచి ఈ‌వి వైపు భారీగా మొగ్గు చూపడం అనేది ఖచ్చితంగా గుర్తించాల్సిన విషయం.

కాలుష్యరహిత దేశం అనే భారీ లక్ష్యం దిశగా మనందరం కలిసి ముందుకు సాగేందుకు అదే స్ఫూర్తిని కస్టమర్లతో పంచుకునేందుకు ఒకినావా అందించే ఆఫర్లు ఉద్దేశించబడ్డాయని, ”శ్రీ. జితేందర్ శర్మ, ఒకినావా ఎం‌.డి అన్నారు. 

కొనుగోలుదారుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన అవగాహన పెరగడం వల్ల ఈ పండుగ సీజన్‌ల్లో వీటి అమ్మకాలు 40% పెరుగుతుందని ఒకినావా ఆశిస్తోంది.

ఒకినావా గురించి

ఒకినావా ఎం‌.డి జితేందర్ శర్మ, శ్రీమతి రూపాలి శర్మ ఛైర్‌పర్సన్ ద్వారా 2015లో ప్రారంభించబడింది. ఒకినావా నేడు భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ ఆటోమొబైల్ కంపెనీల్లో ఒకటి. ఒకినోవా ఫేమ్-II అప్రూవల్ పొందిన మొదటి కంపెనీ, ‘మేక్ ఇన్ ఇండియా’ మీద దృష్టి సారించే భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ.

హై స్పీడ్ ఈ- స్కూటర్‌లు, బైక్‌లను అందించడం ద్వారా కంపెనీ భారతదేశంలో  ఎలక్ట్రిక్ వాహనాల ఎదుగుదలకు దోహదపడుతోంది. పెట్రోల్, డీజిల్ వాహనాలకు నిలకడగా చౌక ప్రత్యామ్నాయాలను సృష్టించడం ద్వారా  కంపెనీ #PowertheChange.అనే బ్రాండ్ లక్ష్యానికి దోహదపడుతోంది. కంపెనీ ప్రధాన కేంద్రం గుర్‌గావ్‌లో తయారీ కేంద్రం భివాండీ, రాజస్థాన్‌లో ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios