హోలీ పండుగ సందర్భంగా టైర్ తయారీదారు సీట్ కంపెనీ ఇప్పుడు కొత్త లిమిటెడ్ ఎడిషన్ జూమ్ రాడ్ ట్యూబ్ లెస్ టైర్లను లాంచ్ చేసింది. ట్యూబ్ లెస్ టైర్లను ఫంకీ కలర్ సైడ్వాల్స్ తో కొత్తగా పరిచయం చేస్తుంది. ఈ టైర్లను హోలీ పండుగ కోసం ప్రత్యేకంగా తయారుచేసింది. 

జూమ్ రాడ్ టైర్లు సైడ్‌వాల్‌లో కొత్త గ్రాఫిక్స్ ఉంటాయి. బ్లు, ఆరెంజ్, బ్లు ఆరెంజ్, పెయింట్ ఆప్షన్స్ లో నచ్చింది ఆర్డర్ చేయవచ్చు.టైర్లు యమహా ఎఫ్‌జెడ్, యమహా ఫాజర్, సుజుకి జిక్సర్, సుజుకి ఇంట్రూడర్‌తో సహా ఇతర బైకులకు కూడా అనుకూలంగా ఉన్నాయి.

also read మారుతి సుజుకి కొత్త కార్లపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు...

లిమిటెడ్ ఎడిషన్   టైర్ల పై సియాట్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమిత్ తోలాని మాట్లాడుతూ లిమిటెడ్ ఎడిషన్ టైర్లను విడుదల చేయడానికి హోలీ  కలర్స్ ఫెస్టివల్  దృష్టిలో పెట్టుకొని  తయారు చేశాము అని అన్నారు.


లిమిటెడ్ ఎడిషన్ సీట్ జూమ్ రాడ్ ట్యూబ్ లెస్ టైర్లు బైక్ రేడియల్స్ తో లభిస్తాయి. కొత్త టైర్లు అధిక రబ్బరు కంటెంట్‌తో వస్తాయని, ఇది మంచి కార్నరింగ్ కాపాసిటి, మంచి గ్రిప్, సున్నితమైన రైడ్‌తో పాటు ఎక్కువ కాలం ఉంటుందని సీట్ కంపెనీ  తెలిపింది.

also read త్రీడీ స్కానింగ్ టెక్నాలజీతో కొత్త హ్యుండాయ్ క్రెటా...17 నుంచి బుకింగ్స్

 హోలీ స్పెషల్ కొత్త టైర్లు కంపెనీ అవుట్‌లెట్లలో, డిస్ట్రిబ్యూటర్స్ పాన్ ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. వీటి కోసం కంపెనీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.