ప్రీమియం బైక్స్ బ్రాండ్ కే‌టి‌ఎం ఇండియా ఎట్టకేలకు కే‌టి‌ఎం 250 అడ్వెంచర్‌ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. కే‌టి‌ఎం 250 అడ్వెంచర్ ధర రూ.2.48 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢీల్లీ), ఈ బైక్ 390 అడ్వెంచర్ కంటే 56,000 చౌకగా లభిస్తుంది.

ఈ 250 అడ్వెంచర్ బైక్ 2019 నవంబర్‌లో సౌత్ ఈస్ట్ ఆసియాలో విడిగా ఆవిష్కరించింది. రెండు బైక్‌లు ఒకే ట్రేల్లిస్ ఫ్రేమ్, ర్యాలీ-డిరైవ్డ్  డిజైన్ లాంగ్వేజ్ ఉంటాయి. గత నెలలోనే కే‌టి‌ఎం 250 అడ్వెంచర్ బుకింగ్‌లు  అన్నీ డీలర్‌షిప్‌ వద్ద ప్రారంభమయ్యాయి, కానీ డెలివరీలు కొద్ది రోజుల్లో అందించనున్నారు.

లాంచ్ సందర్భంగా బజాజ్ ఆటో అధ్యక్షుడు (ప్రోబైకింగ్) సుమీత్ నారంగ్ మాట్లాడుతూ "గత కొన్ని సంవత్సరాలలో అడ్వెంచర్ టూరింగ్‌ కోసం పెరుగుతున్న ధోరణిని చూశాము, ఔట్ డోర్ టూరింగ్‌ పై కూడా ఆసక్తి పెరుగుతోందని అన్నారు. కే‌టి‌ఎం 390 అడ్వెంచర్ ప్లాట్‌ఫామ్‌లో సరికొత్త కే‌టి‌ఎం 250 అడ్వెంచర్ ట్రావెల్-ఎండ్యూరో బైక్,

భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న అడ్వెంచర్‌ మోటార్‌ సైకిళ్ల విభాగాన్ని విస్తరించే లక్ష్యంతో ఈ మోడల్‌ను ఆవిష్కరించినట్లు, ప్రపంచస్థాయి ఫీచర్లతో రూపకల్పన చేసిన ఈ మోడల్‌ను కస్టమర్లు ఆదరిస్తారని అడ్వెంజర్‌ టూరింగ్, అవుట్‌డోర్‌ ప్రయాణాలు పట్ల ఆసక్తి చూపుతున్న యువతకు ఇది సరైన ఎంపిక' అని అన్నారు.

also read టాటా మోటార్స్ మరో అధ్బుతమైన ఘనత.. అనుపమ్ ఖేర్ ద్వారా సక్సెస్ స్టోరీ వీడియో విడుదల.. ...

కే‌టి‌ఎం 250 అడ్వెంచర్, 390 అడ్వెంచర్ రేంజ్ రెండిటికి ఒకే పార్ట్శ్ అందించారు, బైక్‌లలో 250 లో ఎల్‌ఈ‌డి డి‌ఆర్‌ఎల్ హాలోజన్ హెడ్‌ల్యాంప్ వంటి ప్రత్యేకమైన మార్పులు తీసుకొచ్చారు. ఈ బైక్ 14.5 లీటర్ ఇంధన ట్యాంక్‌తో 400 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

సెలెక్టెడ్ ఆఫ్-రోడ్ ఎబిఎస్‌తో పాటు ఎల్‌సిడి స్క్రీన్ కూడా ఉంది. 250 అడ్వెంచర్ కోసం జిపిఎస్, రేడియేటర్ ప్రొటెక్షన్ గ్రిల్, క్రాష్ బంగ్స్, హెడ్‌ల్యాంప్ ప్రొటెక్షన్, హ్యాండిల్‌బార్ ప్యాడ్‌లతో సహా కెటిఎం పవర్‌పార్ట్‌లు కూడా ఉన్నాయి.  

కే‌టి‌ఎం 250 అడ్వెంచర్‌ ఫీచర్స్ 
కే‌టి‌ఎం 250 అడ్వెంచర్‌ బైక్ 248 సిసి సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ తో వస్తుంది, ఇది 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 29.5 బిహెచ్‌పి, 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 24 ఎన్ఎమ్ పీక్ టార్క్ అందిస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు.

అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్‌తో వస్తుంది. సస్పెన్షన్ గురించి చెప్పాలంటే 43 ఎం‌ఎం డబ్ల్యుపి అపెక్స్ యుఎస్‌డి ఫోర్క్స్ అప్ ఫ్రంట్, వెనుక వైపు మోనోషాక్ అందించారు. ఫ్రంట్ యూనిట్ 170 ఎం‌ఎం ఉండగా, వెనుక షాక్ అబ్జార్బర్ 177 ఎం‌ఎం ఉంటుంది. బైక్ ముందు 19 అంగుళాల, వెనుక 17 అంగుళాల ఎం‌ఆర్‌ఎఫ్ టైర్లతో వస్తుంది.

250 అడ్వెంచర్‌లో బ్రేకింగ్ పనితీరు కోసం 320 ఎం‌ఎం డిస్క్ ముందు భాగంలో,  230 ఎం‌ఎం డిస్క్ వెనుక భాగంలో వస్తుంది. బొస్క్ ఎబిఎస్ యూనిట్, సీటు ఎత్తు 855 ఎం‌ఎం ఉండగా, బరువు 177 కిలోలు. కొత్త కే‌టి‌ఎం 250 అడ్వెంచర్ భారతదేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్, బిఎమ్‌డబ్ల్యూ జి 310 జిఎస్, హీరో ఎక్స్‌పల్స్ 200 వంటి మోడళ్లతో పోటీ పడనుంది.