నార్టన్‌తో కైనెటిక్ జేవీ.. రెండేళ్లలో విపణిలోకి 250-500 సీసీ బైక్

పుణె కేంద్రంగా పని చేస్తున్న ఆటోమొబైల్ సంస్థ ‘కైనెటిక్’నూతన తరం వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా 250-500 సీసీ సామర్థ్యంతో కూడిన ఎంట్రీ లెవెల్ మోటారు సైకిళ్లను తయారు చేసేందుకు సిద్ధం అవుతోంది. ఈ మోటారు సైకిల్ రెండేళ్లలో సిద్ధమవుతుందని అంచనా. 
 

Kinetic Working On Developing New 250-500 cc Motorcycle

మహారాష్ట్రలోని పుణె కేంద్రంగా పని చేస్తున్న కైనెటిక్ మోటార్స్ నూతన శ్రేణి మోటారు సైకిళ్లు ప్రత్యేకించి ఎంట్రీ లెవెల్ బైక్‌లను అభివ్రుద్ధి చేయడంపైనే ద్రుష్టిని కేంద్రీకరించింది. అందునా నార్టన్ బ్రాండ్ కింద గ్లోబల్ ప్రొడక్ట్ ఉత్పత్తి చేసేందుకు కైనెటిక్ మోటార్స్ సిద్ధమవుతోంది. 

నూతన తరం వినియోగదారుల ఆకాంక్షలు, అభిరుచులకు అనుగుణంగా ఎంట్రీ లెవెల్ మోటారు సైకిళ్లు.. 250-500 సీసీ సామర్థ్యంతో అన్ని రకాల నూతన మోటారు సైకిళ్లను తయారు చేయాలని భావిస్తోంది. అందుకోసం బ్రిటన్‌కు చెందిన నార్టన్ మోటార్ సైకిల్ సంస్థతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది. 

నార్టన్ సంస్థతో కలిసి కైనెటిక్ మోటార్స్ తయారు చేసే మోటారు సైకిళ్లను ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది. కైనెటిక్ 51 శాతం, నార్టన్ హోల్డింగ్స్ 49 శాతం వాటా కలిగి ఉంటాయి. 

250-500 సీసీ సామర్థ్యం గల నార్టన్ - కైనెటిక్ మోటారు సైకిళ్లను డెవలప్ చేయడానికి రెండేళ్లు పడుతుంది. దీని ధర రూ.2.3 లక్షల మధ్య ఉంటుందని కైనెటిక్ ఇంజినీరింగ్ అండ్ మోటారేల్ మేనేజింగ్ డైరెకెక్టర్ అజింక్యా ఫిరోడియా చెప్పారు. 

ఎంవీ అగస్టా, ఎస్ డబ్ల్యూ ఎం, ఎఫ్ బీ మాండియల్, హ్యూసంగన్, నార్టన్ మాదిరిగా కైనెటిక్ మోటరాయల్ కూడా మల్టీ బ్రాండ్ ఇన్షియేటివ్ చేపట్టింది. తాజాగా 300-500 సీసీ సామర్థ్యం గల మోటారు సైకిళ్ల తయారీ ప్రక్రియ తుది దశకు చేరుకుంటున్నది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios