కవాసాకి వల్కాన్ ఎస్ బిఎస్-6 వెరీఎంట్ వచ్చేసింది.. ధర ఎంతంటే ?
కవాసాకి వల్కాన్ ఎస్ బైక్ బిఎస్ 6 నిబంధనలకు అనుగుణంగా వస్తుంది. బిఎస్ 4 మోడల్‌తో పోలిస్తే కవాసకి వల్కాన్ ఎస్ బిఎస్ 6 ధర ఇప్పుడు రూ.30 వేలు ఎక్కువ. బిఎస్ 6 కంప్లైంట్ ఇంజన్‌తో పాటు, క్రూయిజర్ బైక్ కొత్త మెటాలిక్ ఫ్లాట్ రా గ్రేస్టోన్ కలర్ లో లభిస్తుంది.
కవాసకి మోటార్ ఇండియా సరికొత్త స్టయిల్, లుక్కింగ్ తో కవాసాకి వల్కాన్ ఎస్ బిఎస్ 6 బైకుని ఇండియాలో లాంచ్ చేసింది. దీని ధర 5.79 లక్షలు ఎక్స్-షోరూమ్, ఢీల్లీ. కవాసాకి వల్కాన్ ఎస్ బైక్ బిఎస్ 6 నిబంధనలకు అనుగుణంగా వస్తుంది.
బిఎస్ 4 మోడల్‌తో పోలిస్తే కవాసకి వల్కాన్ ఎస్ బిఎస్ 6 ధర ఇప్పుడు రూ.30 వేలు ఎక్కువ. బిఎస్ 6 కంప్లైంట్ ఇంజన్‌తో పాటు, క్రూయిజర్ బైక్ కొత్త మెటాలిక్ ఫ్లాట్ రా గ్రేస్టోన్ కలర్ లో లభిస్తుంది. సాధారణంగా ఎరుపు, నలుపు బిట్స్‌తో కూడిన బూడిద రంగులో ఉంటుంది.
బైక్ ఒకే కలర్ ఆప్షన్ లో అందుబాటులో ఉంది. బైక్ స్టైలింగ్, ఫీచర్స్ పాత బిఎస్ 4 మోడల్ లాగే ఉంటాయి.కొత్త వెరీఎంట్ బిఎస్ 6 బుకింగులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
కవాసాకి వల్కాన్ ఎస్ ఫీచర్లు
బిఎస్ 6 కంప్లైంట్ తో 649 సిసి ప్యారలల్-ట్విన్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్, 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 60 బిహెచ్‌పిని ఉత్పత్తి చేస్తుంది.
also read ఎంజి మోటర్స్ కొత్త బిజినెస్ ; ఇప్పుడు తక్కువ ధరకే కార్లను కొనోచ్చు.. ...
గరిష్ట టార్క్ ఔట్ పుట్ 6,600 ఆర్‌పిఎమ్ వద్ద 63 ఎన్‌ఎం నుండి 62.4 ఎన్‌ఎం ఉంటుంది. ఇంజన్ కి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అమర్చారు.
దీని బరువు 235 కిలోలు, ఇంధన ట్యాంక్ సామర్థ్యం 14 లీటర్ల ఉంటుంది. సీటు ఎత్తు 705 ఎంఎం.
కవాసాకి బైక్ లో ఎర్గోఫిట్ సిస్టం కూడా ఉంది, ఇది రైడర్ ఇష్టానికి అనుగుణంగా హ్యాండిల్ బార్, ఫుట్‌పెగ్‌లను అడ్జస్ట్ చేసుకోవచ్చు.
కవాసాకి వల్కాన్ ఎస్ బిఎస్ 6 కోసం డిఫరెంట్ సీట్ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది.
బైక్ వీల్స్ పరంగా కూడా ఒకే విధంగా ఉంటాయి, ముందు భాగంలో 41 ఎంఎం టెలిస్కోపిక్ సస్పెన్షన్ అందించారు.
వెనుక వైపు 80 ఎంఎం ఆఫ్-సెట్ మోనోషాక్, ముందు వైపు, డ్యూయల్ పిస్టన్‌లతో 300 ఎంఎం డిస్క్ బ్రేక్, వెనుక చక్రాలకు సింగిల్ పిస్టన్‌తో 250 ఎంఎం డిస్క్‌ను పొందుతాయి.