ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు, ఈ బైక్ పై నాన్ స్టాప్ గా 130 కిమీ. వెళ్లే అవకాశం. కిలోమీటరుకు 10 పైసలే ఖర్చు
ఎలక్ట్రిక్ బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా అయితే దేశీయంగా ఉత్పత్తి అయినటువంటి BattRE Dune E-Bike కేవలం ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు ఆగకుండా 130 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని ప్రకటించింది. అతి త్వరలోనే మార్కెట్లోకి ప్రవేశిస్తున్న ఈ ఎలక్ట్రిక్ బైక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
BattRE Dune E-Bike: జైపూర్‌కు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ BattRE Dune E-Bike భారత మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.BattRE Dune E-Bike అని పేరుతో విడుదల అవుతున్న ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 130 కి.మీల వరకు వెళ్తుందని కంపెనీ గ్యారంటీ ఇస్తోంది.Dune E-Bike మోటార్‌సైకిల్ ఎకో, కంఫర్ట్, స్పోర్ట్స్ అనే మూడు విభిన్న రైడింగ్ మోడ్‌లతో వస్తుంది. బైక్ ఎకో మోడ్‌లో 130 కిమీ మైలేజీని అందుబాటులో తెస్తోంది. ఇది స్పోర్ట్స్ మోడ్‌లో 100 కి.మీ.వరకూ మైలేజీని అందిస్తోందని కంపెనీ తెలిపింది.
BattRE Dune E-Bike ఇ మోటార్‌సైకిల్ ధర రూ. 1 లక్ష నుండి రూ. 1.10 లక్షల మధ్య ఉంటుందని EV స్టార్టప్ వ్యవస్థాపకుడు నిశ్చల్ చౌదరి వెల్లడించారు. ఈ ఎలక్ట్రిక్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ దేశంలో పండుగ సీజన్ లేదా దీపావళి సందర్భంగా విడుదల కావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. నిశ్చల్ చౌదరి ఈ రాబోయే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో విభిన్నమైన మోడల్‌గా ఉంటుందని పేర్కొన్నారు.
భారతీయ రహదారి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ బైక్ EVని రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. ఇది వివిధ కనెక్టివిటీ ఫంక్షన్‌లు మరియు నావిగేషన్‌తో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అనేక ఫీచర్లను ఇందులో గమనించవచ్చు. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ పూర్తి యూనిట్‌గా విక్రయించనున్నారు. పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. డూన్ EV స్టార్టప్ మొదటి మోటార్‌సైకిల్ ఇదే కావడం విశేషం.
ప్రస్తుతం కంపెనీ మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. ఇందులో రెండు తక్కువ వేగం గల ఎలక్ట్రిక్ స్కూటర్లు, కాగా ఒకటి హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావడం విశేషం. BattRE స్టోరీ ఎలక్ట్రిక్ స్కూటర్ గతేడాది జూలైలో విడుదలైంది. బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 89,600 (ఎక్స్-షోరూమ్ ధర) వద్ద విడుదల చేశారు. లాంచ్ సమయంలో, ఎలక్ట్రిక్ స్కూటర్ కేంద్ర ప్రభుత్వం యొక్క FAME II సబ్సిడీకి అర్హత ఉందని కంపెనీ పేర్కొంది.