జావా, జావా 42 ఇంధన సామర్థ్యమెంతో తెలుసా?

క్లాసిక్ లెజెండ్ జావా, జావా 42 మోటార్‌సైకిల్స్‌ను మార్కెట్లోకి పునర్ ప్రవేశపెడుతున్నట్లు మహీంద్రా సంస్థ గత నెలలోనే ప్రకటించింది. ప్రకటించినట్లుగానే ఆ బైక్‌లను తీసుకొచ్చింది. కొనుగోలుదారులు కూడా ఈ బైక్‌లను సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ సమయంలోనే మహీంద్రా సంస్థ ఈ బైక్‌‌ల మైలేజీకి సంబంధించిన వివరాలను వెల్లడించింది.
 
Jawa & Jawa Forty Two Fuel Efficiency Figures Announced

క్లాసిక్ లెజెండ్ జావా, జావా 42 మోటార్‌సైకిల్స్‌ను మార్కెట్లోకి పునర్ ప్రవేశపెడుతున్నట్లు మహీంద్రా సంస్థ గత నెలలోనే ప్రకటించింది. ప్రకటించినట్లుగానే ఆ బైక్‌లను తీసుకొచ్చింది. కొనుగోలుదారులు కూడా ఈ బైక్‌లను సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ సమయంలోనే మహీంద్రా సంస్థ ఈ బైక్‌‌ల మైలేజీకి సంబంధించిన వివరాలను వెల్లడించింది.

సోషల్ మీడియాలో ఓ వినియోగదారుడి ప్రశ్నకు స్పందించిన మహీంద్రా.. ఈ బైక్‌లు ఏఆర్ఏఐ సర్టిఫికేట్ పొందినట్లు తెలిపింది. 37.5కేఎంపీఎల్ సామర్థ్యాన్ని కలిగి ఉందని వెల్లడించింది. 293సీసీ సింగిల్ ఇంజిన్ కలిగిన ఈ బైక్‌లు ఈ స్థాయిలో మైలేజీ ఇవ్వడం స్వాగతించదగ్గ విషయమే.

మహీంద్రా మోజో మాత్రం 30-33కేఎంపీఎల్ ఇస్తుండటం గమనార్హం. జావా, జావా 42 ద్విచక్ర వాహనాలు 14లీటర్ల ఫ్యూల్ ట్యాంక్ కలిగి ఉన్నాయి. ఫుల్ ట్యాంక్ చేయిస్తే ఈ వాహనాలపై దాదాపు 500కి.మీలు తిరిగిరావచ్చు. 

28బీహెచ్‌పీ, 27ఎన్ఎం పీక్ టర్క్, 6 స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి ఉంది. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో మోనోషాక్ యూనిట్, డిస్క్ బ్రేక్, స్టాండర్డ్ సింగ్ ఛానల్ ఏబీఎస్, డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ ఆప్షనల్‌గా ఉంది.

వచ్చే సెప్టెంబర్ వరకు కూడా ఈ బైక్‌లు బుక్ అయిపోయినట్లు మహీంద్రా సంస్థ ప్రకటించింది. ప్రస్తుతానికి ఎలాంటి బుకింగ్స్ తీసుకోవడం లేదని చెప్పింది. కాగా, ఇప్పటికే ఎదరుచూసిన పలువురు వినియోగదారులకు ఈ బైక్‌లను సదరు సంస్థ అందజేసింది. 

ఇక ఈ బైక్‌ల ధరల విషయానికొస్తే.. సింగిల్ ఇంజిన్ ఏబీఎస్ వర్షన్ ధర రూ.1.55లక్షలతో ప్రారంభ ధర కలిగివుంది. డ్యూయెల్ ఛానల్ వర్షన్ ధర రూ.1.64లక్షలు ఉంది. ఇది ఇలావుండగా, జావా 42 ప్రారంభ ధర 1.63లక్షలు, పెరిగిన ధరతో రూ. 1.72లక్షలు(ఇవన్నీ ఎక్స్‌షోరూం ధరలే)గా ఉంది. అంతేగాక, ఈ ఏడాది చివరలో కొత్త  జావా పెరాక్‌ను విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తోందీ సంస్థ.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios