వావ్.. ఇలాంటి వెరైటీ స్కూటర్ లాంటి సైకిల్ ఎప్పుడైనా చూసారా..
ఇంటర్ విద్యార్ధి హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతున్నాడని వెంటనే పోలీసులు పట్టుకున్నారు కానీ తీరా చూస్తే అది స్కూటర్ కాదు సైకిల్ అని అర్ధమైంది. ఈ సంఘటన ఎక్కడో కాదు కేలలలో చోటు చేసుకుంది.
మన్నార్: ఒక ఇంటర్ విద్యార్ధి హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతున్నాడని వెంటనే పోలీసులు పట్టుకున్నారు కానీ తీరా చూస్తే అది స్కూటర్ కాదు సైకిల్ అని అర్ధమైంది. ఈ సంఘటన ఎక్కడో కాదు కేలలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కేరళలోని కయంకుళంలో ఇంటర్ విద్యార్థి సూరజ్ నిర్మించిన ద్విచక్ర వాహనం స్థానికులలో ఆసక్తిని రేపింది.
కేవలం 5,000 రూపాయల వ్యయంతో సూరజ్ పాత సైకిల్, స్కూటర్ విడి భాగాలను ఉపయోగించి ఒక ప్రత్యేకమైన సైకిల్‌ని నిర్మించాడు. లేడీబర్డ్ సైకిల్ వెనుక భాగం, బజాజ్ చేతక్ స్కూటర్ హ్యాండిల్‌బార్లు, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ చైన్ ద్వారా సూరజ్ తన తండ్రి సహాయంతో లాక్ డౌన్ సమయంలో ఈ అరుదైన ద్విచక్ర వాహనాన్ని నిర్మించాడు. సైకిల్ అంటే సాధారణ సైకిల్ కాదు.
also read రెనాల్ట్ క్విడ్ సరికొత్త లేటెస్ట్ లిమిటెడ్ ఎడిషన్.. స్టైలిష్, ఫ్రెష్ లుక్ తో లాంచ్.. ...
ఈ సైకిల్ పెడలింగ్ ద్వారా ముందుకు వెళ్తుంది. ముందు నుండి చూస్తే స్కూటర్ వెనక నుండి చూస్తే సైకిల్. సింగిల్ సీటుతో పాటు సహ క్యారియర్ సీటు కూడా దీనికి ఏర్పాటు చేశారు. ఇంధనం కోసం డబ్బు ఖర్చు చేయకుండా ప్రయాణించడమే తన లక్ష్యం అని సూరజ్ చెప్పారు.
సూరజ్, అతని స్నేహితుడు అభిరామ్ ఒకరోజు వారి ఇంటి నుండి సైకిల్‌పై మన్నార్ చేరుకున్నారు. అక్కడ ఈ వెరైటీ సైకిల్‌ని చూసిన స్థానికులు సెల్ఫీలు తీసుకోవటమే కాక ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో సూరజ్ రూపొందించిన సైకిల్ వైరల్ అయ్యింది.
ఒకసారి సూరజ్ ప్రయాణిస్తున్న ఈ సైకిల్ ని ముందు నుంచి చూసిన పోలీసులు పట్టుకున్నారు. తరువాత అది స్కూటర్ కాదు సైకిల్ అని తెలిసాక సూరజ్ నిర్మించిన ఈ అద్భుతాన్ని పోలీసులు అతన్ని భుజంపై చెయ్యి వేసి అభినందిస్తు వదిలేశారు.