Asianet News TeluguAsianet News Telugu

యమహా బాటలో హోండా: త్వరలో ట్రిపుల్ వీల్ బైక్ నియోవింగ్‌

జపాన్ మోటార్ బైక్ మేకర్ హోండా త్రీ వీల్స్ బైక్ ‘నియోవింగ్’ ట్రిక్‌కు గత నెల 20న పేటెంట్ లభించింది. అయితే దీన్ని మార్కెట్లోకి ఎప్పుడు విడుదల చేయనున్నదో త్వరలో అధికారికంగా హోండా ప్రకటించనున్నది తెలుస్తోంది.

Honda NeoWing Trike Patent Granted
Author
New Delhi, First Published Apr 15, 2019, 11:10 AM IST

న్యూఢిల్లీ: మోటార్ బైక్‌లను తయారు చేస్తున్న జపాన్‌ కంపెనీలు రూట్ మారుస్తున్నాయి. రెండు చక్రాలు గల మోటార్‌సైకిళ్లకు బదులు మూడు వీల్స్‌ ఉన్న బైక్‌ల తయారీపై దృష్టి సారిస్తున్నాయి. 

ఇప్పటికే యమహా.. నికెన్‌ పేరుతో మూడు చక్రాలు గల బైక్‌ను తెచ్చింది. ప్రస్తుతం దీని ఉత్పత్తి జరుగుతోంది. తాజాగా హోండా కంపెనీ తన నియో వింగ్‌కు పేటెంట్‌ను పొందింది. ఈ కాన్సెప్ట్‌ బైక్‌కు ముందు భాగంలో రెండు చక్రాలు, వెనుక భాగంలో ఒక చక్రం ఉంటుంది. ఇలాంటి బైకులను రివర్స్‌ ట్రైక్‌లుగా పిలుస్తుంటారు. 

ఈ బైక్‌ పేటెంట్‌ కోసం 2016లో హోండా దరఖాస్తు చేసింది. ఈ ఏడాది మార్చి 20వ తేదీన దీనికి పేటెంట్‌ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ బైక్‌లో 2 సిలిండర్‌ లేదా 6 సిలిండర్‌ ఇంజన్‌ ఉండవచ్చని సమాచారం. ఈ బైక్‌ను హోండా ఎప్పుడు మార్కెట్లోకి తెస్తుందన్న దానిపై స్పష్టత లేదు. పేటెంట్‌ వచ్చిన నేపథ్యంలో త్వరలోనే ఈ బైక్‌కు సంబంధించి హోండా అధికారికంగా ఒక ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు.

వీ-ట్విన్ లేదా ట్రాన్స్‌వర్స్ లే ఔట్ కలిగి ఉండే హోండా నియో వింగ్ బైక్‌లో ఇంతకుముందు హోండాగోల్డ్ వింగ్ బైక్‌లో 126 బీహెచ్పీ, 170 ఎన్ఎం సామర్థ్యం గల ఇంజిన్ వాడనున్నది. అలాగే ఎలక్ట్రిక్ మోటార్ వినియోగంతో నడిచే నియో వింగ్ బైక్‌ను కూడా హీరో రూపొందిస్తోంది. 

విద్యుత్ వినియోగ ఇంజిన్‌ను రేర్ వీల్స్‌పై గానీ, ఫ్రంట్ వీల్‌పై గానీ అమర్చవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో 847 సీసీ సామర్థ్యం గల యమహా నికెన్ ‘ట్రిపుల్ వీల్స్’ బైక్ అందుబాటులో ఉంది. 3 సిలిండర్ ఇంజిన్ తోపాటు 111.8 బీహెచ్పీ, 87.5 ఎన్ఎం పీక్ గల టార్చితో రూపుదిద్దుకున్న యమహా నికెన్.. యమహా ఎంటీ -09తో సరిపోలుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios