కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా ఆటోమొబైల్స్ సేల్స్ పై గణనీయమైన ప్రభావం చూపించింది. లాక్ డౌన్ వల్ల సేల్స్ లేక ఆర్ధికంగా కుదేలైంది. అయితే లాక్ డౌన్ ఆంక్షల సడలింపుతో మళ్ళీ ఆటోమొబైల్స్  రంగం సేల్స్ చక్కబెట్టేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది.

అయితే తాజాగా సేల్స్ పెంచడానికి హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా వివిధ పేమెంట్ పథకాలను ప్రవేశపెట్టింది. ఇప్పుడు, వినియోగదారులు 3 నెలల కాలానికి 50 శాతం ఇఎంఐ చెల్లించి హోండా యాక్టివా 6జి, హోండా షైన్ కొనుగోలు చేయవచ్చు.

ఈ ఇఎంఐ ఆఫర్లను అందించడానికి కంపెనీ కొన్ని బ్యాంకులతో జతకట్టింది. ఐడిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ద్వారా ద్విచక్ర వాహనాల కోసం కొనుగోలు చేయాలని  చూస్తున్నవారు  36 నెలల బైక్ లోన్ ద్వారా మొదటి మూడు నెలలు ఇఎంఐలో సగం మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.

అయితే ఇది తొలి మూడు నెలలు తర్వాత పూర్తి ఈఎంఐ కట్టాలి. అంతేకాకుండా వినియోగదారులు బైక్ లోన్ మొత్తంలో 95 శాతం వరకు రుణాన్ని పొందొచ్చు. ఇక మిగతా 5 శాతం కస్టమర్ డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది.

also read  అత్యంత తక్కువ ధరకే దొరికే అడ్వెంచర్ బైక్ వచ్చేసింది.. ...

క్రెడిట్ కార్డు ద్వారా బైక్‌ పేమెంట్ చేయడానికి ఎదురుచూసే వారు కూడా అనేక ప్రయోజనాలను పొందుతారు. ఎస్‌బి‌ఐ నుండి క్రెడిట్ కార్డును ఉపయోగించి ఏదైనా హోండా ద్విచక్ర వాహనానికి కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తుంది.

అయితే ఈ ఆఫర్ కి సంబంధించిన షరతులలో ఒకటి హోండా యాక్టివా 6జి, సిడి 110 డ్రీం, షైన్, ఎస్‌పి 125, యాక్టివా 125, లివో, గ్రాజియా, డియో వంటి స్థానికంగా తయారు చేసిన మోడళ్లకు మాత్రమే ఆఫర్లు వర్తిస్తాయి. ఈ ఆఫర్ దేశవ్యాప్తంగా ఎంచుకున్న కొన్ని షోరూమ్‌లలో అందుబాటులో లేదు.

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ సడలింపు తరువాత హోండా యూనిట్లు, మోడళ్ల తయారీని వేగవంతం చేసింది. హర్యానా, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటకలోని యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ నెలలో దాని ఉత్పత్తితో పాటు సేల్స్ పెంచాలని సంస్థ ఎదురుచూస్తోంది.