సరికొత్త లుక్ లో హోండా హార్నెట్ 2.0 రెప్సోల్ ఎడిషన్.. ధర, ఫీచర్స్ వివరాలు తెలుసుకోండి
భారతదేశంలో హార్నెట్ 2.0 రెప్సోల్ హోండా ఎడిషన్‌ను విడుదల చేసింది. రెప్సోల్ హోండా మోటోజిపి రేసింగ్ టీమ్ ఆధారంగా కొత్త గ్రాఫిక్స్, రంగులో వస్తుంది.
ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా-హెచ్‌ఎంఎస్‌ఐ భారతదేశంలో హార్నెట్ 2.0 రెప్సోల్ హోండా ఎడిషన్‌ను విడుదల చేసింది. రెప్సోల్ హోండా మోటోజిపి రేసింగ్ టీమ్ ఆధారంగా కొత్త గ్రాఫిక్స్, రంగులో వస్తుంది. కొత్త ఎడిషన్ 2020 అక్టోబర్‌లో వచ్చిన హోండా 800 గ్రాండ్ ప్రిక్స్ విన్ ఈవెంట్.
హార్నెట్ 2.0 రెప్సోల్ హోండా ఎడిషన్: ధర
హార్నెట్ 2.0 రెప్సోల్ హోండా ఎడిషన్ గురుగ్రామ్ ఎక్స్-షోరూమ్ ధర రూ .1.28 లక్షలు. రెప్సోల్ ఎడిషన్ మోడల్స్ ఈ వారం నుంచి హోండా డీలర్‌షిప్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంటాయని కంపెనీకి సమాచారం అందించింది.
హార్నెట్ 2.0 రెప్సోల్ హోండా మోటో జిపి బైక్ నుండి ప్రేరణ పొందిన అద్భుతమైన కలర్ కాంబినేషన్లతో రానుంది. అయితే, కొత్త రంగు కాకుండా, ఈ బైక్‌లో మీకు ఎలాంటి మార్పు కనిపించదు. అంతే కాకుండా దాని ఇంజిన్ లో కూడా ఎటువంటి మార్పులు చేయలేదు.
also read ఇండియన్ మార్కెట్లోకి కేటీఎం 250 అడ్వెంచర్ బైక్ లాంచ్.. ధర ఎంతంటే ? ...
హార్నెట్ 2.0 రెప్సోల్ హోండా ఎడిషన్ పనితీరు గురించి మాట్లాడుతూ, ఇది 184 సిసి సింగిల్ సిలిండర్, ఫ్యుయెల్ ఇంజెక్షన్ ఇంజన్, ఇంజిన్ గరిష్ట శక్తి 17 బిహెచ్‌పి, పీక్ టార్క్ 16.1 ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ అందించారు.
హోండా హార్నెట్ 2.0 ఫీచర్స్ చెప్పాలంటే రెగ్యులర్ ఈ మోడల్ బైక్ 8 ఆన్ బోర్డ్ సెన్సార్లను ఉపయోగిస్తుంది, ఈ బైక్ కేవలం 11 సెకన్లలో 200 మీటర్లు ప్రయాణించగలదు.
హోండా హార్నెట్ 2.0: సస్పెన్షన్ & బ్రేకింగ్
ఈ బైక్ కి గోల్డ్ రంగులో యూఎస్‌డి ఫ్రంట్ ఫోర్క్‌లు ఉన్నాయి. వెనుక సస్పెన్షన్ కోసం సింగిల్ మోనోషాక్ యూనిట్ ఇచ్చారు. ఈ బైక్ రెండు వైపులా డిస్క్ బ్రేక్‌లతో పాటు సింగిల్-ఛానల్ ఎబిఎస్ పొందుతుంది.
హోండా హార్నెట్ 2.0: కలర్ ఆప్షన్
హార్నెట్ 2.0 బైక్ నాలుగు రంగులలో లభిస్తుంది. వీటిలో పెర్ల్ ఇగ్నిస్ బ్లాక్, మాట్ రెడ్ మెటాలిక్, మాట్టే గ్రే మెటాలిక్, మాట్టే మార్వెల్ బ్లూ మెటాలిక్ ఉన్నాయి.