అదిరిపోయే కొత్త స్టైలిష్ లుక్ తో హార్నెట్ 2.0 బైక్.. ఇప్పుడు 184సిసి, బిఎస్-6 వెరీఎంట్ లో..

సరికొత్త మోడల్ హార్నెట్ 2.0 బైక్ రూ. 1.26 లక్షల ధరతో  విడుదల చేసింది. దేశంలో 180-200 సిసి బైక్ విభాగంలోకి  హార్నెట్ 2.0 ప్రవేశించినట్లు హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) గురువారం తెలిపింది. ఈ బైక్ సెప్టెంబర్ ఆరంభం నుండి లభిస్తుంది.
 

Honda Hornet 2.0 launched at Rs 1.26 lakh ex-showroom check for  Engine, specifications and features here

ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా కంపెనీ సరికొత్త బిఎస్ 6 కంప్లైంట్ హార్నెట్ 2.0 ను విడుదల చేసింది. దీని ధర 1.26 లక్షల ఎక్స్-షోరూమ్. హార్నెట్ 2.0 బైక్ 180-200 సిసి ఎంట్రీ లెవల్ విభాగంలో చేరనుంది. హోండా హార్నెట్ టీవీఎస్ అపాచీ, బజాజ్ పల్సర్ 200లకు పోటీగా ఉంటుంది.  

హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ & సిఇఒ అట్సుషి ఒగాటా  హార్నెట్ 2.0 లాంచ్ గురించి  మాట్లాడుతూ, “యువత, కొత్త కస్టమర్ల కలలు, అభిరుచి నుండి ఈ బైక్ ప్రేరణ పొంది, సరికొత్త హోండా హార్నెట్ 2.0 ను పరిచయం చేయడం మాకు సంతోషంగా ఉంది. దాని అధునాతన టెక్నాలజీ & అధ్భూత పనితీరుతో కొత్త హార్నెట్ 2.0 యువ బైక్ రైడర్లకు  కొత్త బెంచ్ మార్కును సృష్టిస్తుంది.  


సరికొత్త మోడల్ హార్నెట్ 2.0 బైక్ రూ. 1.26 లక్షల ధరతో  విడుదల చేసింది. దేశంలో 180-200 సిసి బైక్ విభాగంలోకి  హార్నెట్ 2.0 ప్రవేశించినట్లు హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) గురువారం తెలిపింది. ఈ బైక్ సెప్టెంబర్ ఆరంభం నుండి లభిస్తుంది.

also read హీరో ప్రభాస్ తన జిమ్ ట్రైనర్‌కు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలిస్తే షాక్ అవుతారు ...

కొత్త హార్నెట్ 2.0 పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మాట్టే సాంగ్రియా రెడ్ మెటాలిక్, మాట్టే యాక్సిస్ గ్రే మెటాలిక్, మాట్టే మార్వెల్ బ్లూ మెటాలిక్ అనే నాలుగు అద్భుతమైన రంగులలో లభిస్తుంది. హార్నెట్ 2.0 ఆకర్షణీయంగా ధర రూ.1,26,345 ఎక్స్-షోరూమ్ గురుగ్రామ్ (హర్యానా).

కొత్త మోడల్ ఆల్-న్యూ 184 సిసి బిఎస్-6 పవర్‌ట్రెయిన్, కొత్త ప్లాట్‌ఫామ్ ఇంజిన్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్ వంటి ఫీచర్స్ తో వస్తుంది. సుపీరియర్ ఏరోడైనమిక్ డిజైన్ సున్నితమైన నిర్వహణ కోసం సహాయపడుతుంది

ఆల్‌రౌండ్ ఎల్‌ఇడి లైటింగ్ ప్యాకేజీ (పొజిషన్ లాంప్‌తో న్యూ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్, న్యూ ఎల్‌ఇడి వింకర్స్, ఎక్స్-షేప్డ్ ఎల్‌ఇడి టెయిల్ లాంప్) ద్వారా స్టైలింగ్ మెరుగుపరిచింది. ట్యాంక్ ప్లేస్‌మెంట్‌పై కొత్త స్పోర్టి స్ప్లిట్ సీట్ & న్యూ కీ, రైడర్‌కు మరింత సౌలభ్యాన్ని జోడిస్తూ దాని స్త్ర్రెట్ ఫైటర్ పాత్రను పెంచుతుంది.

స్పోర్టి క్యారెక్టర్ షార్ట్ మఫ్లర్, స్పోర్టి కొత్త అల్లాయ్ వీల్ డిజైన్‌తో మరింత ప్రాచుర్యం పొందింది, అల్లాయ్ ఫుట్ పెగ్స్ మొత్తం స్టైల్ కి జోడిస్తుంది. హోండా హార్నెట్ 2.0 పై మూడేళ్ల వారంటీని స్టాండర్డ్ గా ఇస్తుంది, దీనితో పాటు అదనపు మూడేళ్ల వారంటీ కూడా పొందవచ్చు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios