హీరో మోటర్స్ నుండి కొత్త బిఎస్ 6 వేరిఎంట్ బైక్...
ద్విచక్ర వాహనాలు కార్బ్యురేటెడ్ ఇంజన్‌ల నుండి ఫ్యుయెల్-ఇంజెక్ట్ ఇంజన్‌లకు మార్పు చేయాలని కోరింది. ఇప్పటికే ఉన్న ఎలక్ట్రానిక్ ఫ్యుయెల్ -ఇంజెక్షన్ ఇంజన్‌లు కూడా, కొత్త బిఎస్ 6 ఉద్గారాల నిబంధనలకు అనుగుణంగా మార్చల్సి ఉంటుంది.
బిఎస్ 6 మోడళ్లలో మార్పులు అంటే నిబంధనలకు అనుగుణంగా ఉద్గారాలను అప్ డేట్ చేసి ఉంచడం. ఇందుకోసం వాహన తయారీదారులకు ఎక్కువ పెట్టుబడి, మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించవలసి ఉంటుంది.
also read కారు కోనాలంటే కొత్త పద్దతి...నచ్చిన కారు ఇంటి వద్దకే డెలివరి..
హీరో మోటోకార్ప్ ఎక్స్‌పల్స్ బైక్ ధరలను ఇంకా ప్రకటించనప్పటికీ, ఇది దీని ధర కాస్త ఖరీదైనదిగా భావిస్తున్నారు. ప్రారంభంలో హీరో ఎక్స్‌పల్స్ బైక్ కార్బ్యురేటర్, ఫ్యుయెల్-ఇంజెక్ట్ వేరియంట్లలో బిఎస్ 4 గల ఎక్స్‌పల్స్ అందించారు, కానీ ఇప్పుడు, బిఎస్ 6 జెనరేషన్ కాబట్టి ఫ్యుయెల్-ఇంజెక్ట్ ఇంజన్‌తో మాత్రమే అందిస్తున్నారు.
బిఎస్ 6 హీరో ఎక్స్‌పల్స్ పాత మోడల్ తో పోల్చితే కొత్త మోడల్ 3 కిలోల అధిక బరువు ఉంటుంది. బిఎస్ 4 మోడల్ బరువు 154 కిలోల ఉంటే ఈ బైక్ ఇప్పుడు 157 కిలోల బరువు ఉంటుంది. ఇక ధర విషయానికొస్తే, హీరో మోటోకార్ప్ బిఎస్ 6 మోడల్ ధరలను ఇంకా ప్రకటించలేదు, కాని ధరలు సుమారు రూ.1.12 లక్షల నుండి 1.15 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.