హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ బిఎస్ 6 వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే ?
కొత్తగా బిఎస్ 6 హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ భారతదేశంలో లాంచ్ చేసింది. బిఎస్ 4 ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ ధర కంటే బిఎస్ 6 వేరియంట్ ధర రూ.13,000 ఎక్కువ. దీని ధర రూ. 1.02 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢీల్లీ ).
ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటార్స్ కొత్తగా బిఎస్ 6 హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ భారతదేశంలో లాంచ్ చేసింది. బిఎస్ 4 ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ ధర కంటే బిఎస్ 6 వేరియంట్ ధర రూ.13,000 ఎక్కువ. దీని ధర రూ. 1.02 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢీల్లీ ).
బిఎస్ 6 కంప్లైంట్ ఇంజిన్‌తో పాటు హీరో ఎక్స్‌సెన్స్ టెక్నాలజీ, ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్, ఆయిల్ కూలర్ తో వస్తుంది. హీరో మోటోకార్ప్ మాట్లాడుతూ "ఈ టెక్నాలజి మెరుగైన మన్నికను, ఇంజన్ ఓవర్ హిటింగ్ కాకుండా చేస్తాయని" చెప్పారు.
కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 200 సిసి బైక్, 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 17.8 బిహెచ్‌పి, 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 16.4 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అవుట్ పుట్ ఇస్తుంది, ఇది బిఎస్ 4 మోడల్ కంటే స్వల్పంగా తక్కువ.
బిఎస్ 4 బైక్ 200 సిసి ఎయిర్-కూల్డ్ ఇంజన్, 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 18 బిహెచ్‌పి, 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 17.1 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను అభివృద్ధి చేస్తుంది. బిఎస్ 6 హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ కూడా 'పెర్ల్ ఫేడ్‌లెస్ వైట్' అనే కొత్త రంగులో అందుబాటులోకి వస్తుంది.
ఈ బైక్ ఇప్పుడు మొత్తం మూడు రంగులలో లభిస్తుంది, స్పోర్ట్స్ రెడ్ అలాగే పాంథర్ బ్లాక్. బిఎస్ 6 కంప్లైంట్ ఇంజన్‌తో పాటు బైక్ ట్విన్ ఎల్‌ఇడి హెడ్‌లైట్, బ్లూటూత్ కనెక్టివిటీ విత్ టర్న్ బై టర్న్ నావిగేషన్, డిజిటల్ ఎల్‌సిడి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, 7-లెవెల్ అడ్జస్ట్ చేయగల మోనోషాక్ బ్యాక్ సస్పెన్షన్‌తో వస్తుంది. సింగిల్ ఛానల్ ఏబిఎస్ తో 276 ఎంఎం ఫ్రంట్ డిస్క్, వెనుక భాగంలో 220 ఎంఎం డిస్క్ అందించారు.
ఈ బైక్ ఇప్పుడు 154.5 కిలోల బరువు ఉంటుంది, ఇది బిఎస్ 4 మోడల్ కంటే 5.5 కిలోలు ఎక్కువ. బైక్ పూర్తి-ఫెయిరింగ్ డిజైన్ బిఎస్ 4 మోడల్ లాగానే ఉంటుంది. ఈ బైక్ ధర రూ.1.16 లక్షలు.