ఇంటి వద్దకే ‘హీరో’ బైక్స్

ప్రముఖ మోటారు సైకిళ్ల తయారీ సంస్థ ‘హీరో మోటో కార్ప్స్’ తన సేల్స్ పెంచుకోవడానికి వినూత్న పథకాలు అమలు చేస్తోంది. వినియోగదారుల ఇంటి వద్దకే బైక్‌లు, స్కూటర్లను డెలివరీ చేస్తోంది. 

Hero MotoCorp unveils initiative to deliver bikes, scooters at customer doorstep

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ వేదికగా కొనుగోలు చేసే ప్రతి వస్తువు మన గుమ్మం ముందుకే వస్తోంది. కొన్ని రిటైల్‌ దుకాణాలు సైతం వినియోగదారుల సౌకర్యర్థం ఉచితంగానో, కొద్ది మొత్తంలో రుసుం వసూలు చేసి వస్తువులను ఇంటికి చేరుస్తున్నాయి. 

ఇప్పుడు ఈ బాటలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ కూడా ప్రయాణిస్తోంది. హీరో ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసే వారికి వాటిని హోం డెలివరీ చేయనుంది. ఇందుకోసం తక్కువ మొత్తంలో ఛార్జ్‌ చెల్లిసే సరిపోతుందని పేర్కొంది. 

హోండా మోటో కార్ప్స్ ఇప్పటికే ముంబై, బెంగళూరు, నొయిడాలలో ఈ సేవలను తీసుకురాగా, త్వరలోనే 25 నగరాలకు ఈ సేవలను విస్తరించాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ‘కస్టమర్లు అద్భుతమైన అనుభూతిని ఆస్వాదించేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని పరిశీలిస్తున్నాం’ అని హీరో మోటో కార్ప్స్ సేల్స్ విభాగం అధిపతి సంజయ్ భన్ చెప్పారు.  
‘ఇందుకోసం వినూత్న కార్యక్రమాలు తీర్చిదిద్దుతున్నాం. తాజా నిర్ణయంతో ద్విచక్రవాహనాల కేటగిరీలో వినియోగదారులు మరింత సౌకర్యంగా ఉంటారని ఆశిస్తున్నాం’అని హీరో మోటోకార్ప్‌ సేల్స్‌ విభాగాధిపతి సంజయ్‌ భన్‌ తెలిపారు. తాము కొనుగోలు చేసే ప్రతి వస్తువుపైనా అదనపు సేవలు అందాలని యువత భావిస్తోందని అన్నారు. 

‘మోటర్‌ సైకిల్‌, స్కూటర్లను తొలుత ఈ-కామర్స్‌ వేదిక మీదకు తీసుకొచ్చాం, వినియోగదారుల చిరునామాకే కాకుండా వారు కోరిక మేరకు ఎక్కడికైనా డెలివరీ చేస్తాం’ అని సంజయ్‌ తెలిపారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios