ఫ్యూయల్ ఇంజెక్షన్, యూఎస్‌బీ చార్జర్‌తో హీరో గ్లామర్ స్పెషల్ ఎడిషన్..
హీరో మోటోకార్ప్ సోమవారం హీరో గ్లామర్ కొత్త స్పెషల్ ఎడిషన్ మోడల్‌ను విడుదల చేసింది. హీరో గ్లామర్ బ్లేజ్ మోడల్ ధర రూ.72,200 (ఎక్స్-షోరూమ్, ఢీల్లీ) తో వస్తుంది.
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ సోమవారం హీరో గ్లామర్ కొత్త స్పెషల్ ఎడిషన్ మోడల్‌ను విడుదల చేసింది. హీరో గ్లామర్ బ్లేజ్ మోడల్ ధర రూ.72,200 (ఎక్స్-షోరూమ్, ఢీల్లీ) తో వస్తుంది.
గ్లామర్ బ్లేజ్ 125 సిసి ఇంజన్ ఎక్స్‌సెన్స్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్‌తో వస్తుంది. 10.7 బిహెచ్‌పి వద్ద 7500 ఆర్‌పిఎమ్‌ను, 10.6 ఎన్ఎమ్ వద్ద 6000 ఆర్‌పిఎమ్ టార్క్ అందిస్తుంది. ఐడిల్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్‌ను కూడా కొత్తగా అందించారు. దీనిని హీరో ఐ3ఎస్ అని పిలుస్తారు అలాగే ఆటో సెయిల్ టెక్నాలజీని ఇందులో ఉంది.
also read పండగ సీజన్ లో కారు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ కార్లు మీకు బెస్ట్ ఆప్షన్ ! ...
హీరో గ్లామర్ బ్లేజ్‌లో హ్యాండిల్‌బార్‌కు అనుసంధానించబడిన యుఎస్‌బి ఛార్జర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ నూతనంగా ప్రవేశపెట్టారు. కొత్త మోడల్ మైలేజ్ పై సమాచారం లేనప్పటికి పాత మోడల్ లాగానే మిగతా ఫీచర్స్ ఉన్నట్లు తెలుస్తుంది.
"ఇటీవల ప్రారంభించిన కొత్త గ్లామర్ బైక్ కు రెస్పాన్స్ సానుకూలంగా ఉంది. కొత్త బ్లేజ్ ఎడిషన్ దేశంలోని యువతను ఆకర్షిస్తుంది" అని హీరో మోటోకార్ప్ హెడ్ - సేల్స్ అండ్ ఆఫ్టర్‌సేల్స్ నవీన్ చౌహాన్ అన్నారు.
హీరో గ్లామర్ బ్లేజ్ మాట్ వెర్నియర్ గ్రే కలర్ ఫంక్-లైమ్ ఎల్లో గ్రాఫిక్స్ అందించారు. దేశవ్యాప్తంగా ఉన్న హీరో మోటోకార్ప్ షోరూమ్‌లలో గ్లామర్ బ్లేజ్ అందుబాటులో ఉంది.