హార్లే-డేవిడ్సన్ బ్రాండ్ 'రివైర్' వ్యూహంలో భాగంగా భారతదేశంలో సేల్స్, తయారీ కార్యకలాపాలను నిలిపివేయానున్నట్లు ప్రకటించింది. హార్లే-డేవిడ్సన్ ఇండియా దీనిపై ఒక పత్రికా ప్రకటనను కూడా విడుదల చేసింది.

బావాల్‌లో ఉన్న హార్లే-డేవిడ్సన్ బైక్ తయారీ కేంద్రాన్ని, గురుగ్రామ్‌లోని సేల్స్ ఆఫీస్ మూసివేస్తున్నట్లు పేర్కొంది. హార్లే-డేవిడ్సన్ మేడ్-ఇన్-ఇండియా మోడల్స్ హార్లే-డేవిడ్సన్ స్ట్రీట్ 750, హార్లే-డేవిడ్సన్ స్ట్రీట్ రాడ్ బైకులను నిలిపివేస్తున్నట్లు  ఒక పత్రిక ద్వారా వెల్లడైంది.

ఈ రెండు బైకుల నిలిపివేతపై నిర్ణయం ఒక నెలల క్రితమే తీసుకుంది, అందుకే హార్లే-డేవిడ్సన్ ఇండియా ఈ మోడళ్లపై భారీ తగ్గింపు అందిస్తోంది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హార్లే-డేవిడ్సన్ బైక్  స్ట్రీట్ 750పై  కంపెనీ 65,000 ధర తగ్గింపును ప్రకటించింది,

also read ఆశ్చర్యపరుస్తున్న ఎంజి గ్లోస్టర్ ఎస్‌యూ‌వి కార్ ఫీచర్లు.. నేటి నుంచి బుకింగ్స్ ప్రారంభం.. ...

దీని ధర 4.69 లక్షలకు (ఎక్స్-షోరూమ్). మరోవైపు హార్లే-డేవిడ్సన్ స్ట్రీట్ రాడ్ ధర పై 77,000 తగ్గించింది, దీని అసలు రూ.5.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

హార్లే-డేవిడ్సన్ స్ట్రీట్ 750 భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌. ఇప్పటికే ఉన్న బైక్  స్టాక్‌ను లిక్విడేట్ చేయడానికి హార్లే-డేవిడ్సన్ బైకుల ధరల  తగ్గింపును ప్రకటించారు.

దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 33 డీలర్షిప్ నెట్‌వర్క్, కాంటాక్ట్ టర్మ్ ద్వారా ఇప్పటికే ఉన్న హార్లే-డేవిడ్సన్ బైక్ కస్టమర్లకు సర్వీసులు   అందిస్తుందని  చెప్పారు. సర్వీస్, విడిభాగాల పరంగా భవిష్యత్తులో కస్టమర్లకు సేవలు అందించడం పై ఇంకా ఖచ్చితమైన ప్రకటన చేయలేదు.